Day and night test
-
‘పింక్ టెస్టు’ బరిలో మహిళలు
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు తమ 45 ఏళ్ల టెస్టు మ్యాచ్ చరిత్రలో ఇప్పటి వరకు 36 టెస్టులు ఆడింది. జూన్ 16నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు 37వది అవుతుంది. దీని తర్వాత తొలి సారి మన టీమ్ మిథాలీ రాజ్ నాయకత్వంలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. సెప్టెంబర్ 30నుంచి పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టును ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా పింక్ బాల్ టెస్టు అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పర్యటన షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు (సీఏ) ఖరారు చేసింది. సెప్టెంబర్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 7, 9, 11 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏకైక టెస్టును నిర్వహిస్తారు. మహిళల క్రికెట్లో గతంలో ఒకే ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిడ్నీలో జరిగిన ఈ టెస్టు డ్రాగా ముగిసింది. -
ఈ బంతులు ఆడేదెలా?
మ్యాచ్ ముగిశాక విరాట్ కోహ్లి చెప్పిన దాని ప్రకారం చూస్తే భారత్ శనివారం ఆరంభంలోనే కాస్త వేగంగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే అతను చెబుతున్న దూకుడు ఫలితాన్ని ఇచ్చేదా అనేది సందేహమే. తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఇదే బౌలర్లను మన బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి మన బ్యాట్స్‌మెన్ టెక్నిక్ కూడా ఒక్కసారిగా ఏమీ మారిపోదు. అయితే శనివారం పరిస్థితులు వారి అదుపులో ఉన్నట్లుగా కనిపించలేదు. ఆస్ట్రేలియా పేసర్లు అద్భుత బౌలింగ్ ముందు ఏమీ చేయలేని స్థితిలో చేతులెత్తేసినట్లుగా కనిపించింది. హాజల్‌వుడ్, కమిన్స్ చేతుల్లో బంతి స్వింగ్ అయిన తీరు మహా మహా బ్యాట్స్‌మెన్‌కే ఇబ్బంది సృష్టించేలా కనిపించింది. ఆడితే ఒక బాధ, ఆడకపోతే ఒక కష్టం అన్నట్లుగా బ్యాట్స్‌మెన్ మనసులో రెండు ఆలోచనలతో బంతిని ఎదుర్కొన్నారు. అంతా ఆసీస్‌కు అనుకూలంగానే సాగింది. డ్రైవ్ చేసే అవకాశం లేకుండా సరైన లెంగ్త్‌లో బంతులు పడ్డాయి. బ్యాట్‌ను దాటి వెళ్లిపోకుండా సరిగ్గా ఎడ్జ్ తీసుకున్నాయి. బ్యాట్స్‌మెన్ క్రీజ్ నుంచి కదిలే అవకాశం లేని విధంగా పిచ్‌పై బౌన్స్ కనిపించింది. తొలి రోజుతో పోలిస్తే ఊహించినట్లుగానే పిచ్ వేగంగా మారిపోయింది. దాంతో కీపర్ ముందు పడకుండా సరిగ్గా బంతులు చేతుల్లోకే వెళ్లాయి. సరిగ్గా చెప్పాలంటే రెండు రోజులుగా చూడని ఒక అద్భుత సెషన్ ఇక్కడ కనిపించింది. వికెట్ కీపర్ పైన్ అందుకున్న ఐదు క్యాచ్‌లు రీప్లేలో మళ్లీ మళ్లీ చూస్తే అన్ని వికెట్లు ఒకేలా కనిపిస్తాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు! అయితే మన బ్యాటింగ్‌లో పూర్తిగా లోపాలు లేవని చెప్పలేం. 165, 191, 242, 124, 244, 36... వరుసగా ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లలో భారత జట్టు స్కోర్లు ఇవి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ చేతిలో 0–2తో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం 250 పరుగులు చేయలేకపోవడం విదేశీ గడ్డపై మన ప్రదర్శన ఏమిటో మరోసారి చూపించింది. 36 పరుగులు అనేది అయ్యో అనిపిస్తున్నా... స్వల్ప స్కోర్లకే ఆలౌట్ కావడం అనూహ్యమేమీ కాదు. బంతి కాస్త స్వింగ్ అవుతుందంటే చాలు మన బ్యాట్స్‌మెన్‌లో తడబాటు కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే మన ఆటగాళ్ల డిఫెన్స్ టెక్నిక్ చాలా పేలవంగా ఉంది. కోహ్లి వెళ్లిపోయాక... ముందుగా అనుకున్నట్లుగానే కెప్టెన్ కోహ్లి తన భార్య ప్రసవం కారణంగా ఒక్క టెస్టు తర్వాతే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. అతనితో పోలిస్తే కాస్త శాంతం కనబర్చే రహానే కెప్టెన్‌గా ఆసీస్ గడ్డపై జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. ముఖ్యంగా ఇంత ఘోర ప్రదర్శన తర్వాత టీమ్‌ను మానసికంగా సంసిద్ధం చేయడం కీలకం. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కోహ్లి, విఫలమైన పృథ్వీ షా స్థానాల్లో గిల్, రాహుల్ రావచ్చని తెలుస్తోంది. వీరిద్దరు జట్టుకు ఎంత బలంగా మారతారో చెప్పలేం. ఇన్ని సమస్యలు దాటి ఆసీస్‌ను ఓడించగలమా అనేది అతి పెద్ద ప్రశ్న! ► భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా రెండంకెలు స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇలా జరగడం రెండోసారి. 1924లో బర్మింగ్హమ్లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 11 పరుగులు ఉన్నాయి. ► సొంతగడ్డపై ఆడిన ఎనిమిది డే–నైట్ టెస్టుల్లోనూ గెలిచి ఆస్ట్రేలియా తమ అజేయ రికార్డును కొనసాగించింది. ► భారత జట్టులోకి వచ్చాక కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయకుండా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌ను ముగించడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఏడాది కోహ్లి మూడు టెస్టులు, తొమ్మిది వన్డేలు, పది టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఏడాది కూడా కోహ్లి సెంచరీ చేయలేదు. ► కెప్టెన్ కోహ్లి టాస్ గెలిచాక భారత్ ఓడిపోయిన తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి కెప్టెన్సీలో భారత్ 25 టెస్టుల్లో టాస్ గెలిచింది. 21 టెస్టుల్లో భారత్‌కు విజయం దక్కగా... మరో నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. ► ఆసియా అవతల భారత జట్టు ఓ సిరీస్‌లోని తొలి టెస్టులో ఓడిపోవడం ఇది 35వ సారి. తొలి టెస్టు ఓడిపోయాక భారత్ 31 సార్లు సిరీస్‌ను కూడా చేజార్చు కుంది. కేవలం మూడుసార్లు మాత్రమే సిరీస్‌లను ‘డ్రా’గా ముగించింది. ► ఈ మ్యాచ్ ద్వారా హాజల్‌వుడ్ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 18వ ఆస్ట్రేలియా బౌలర్‌గా హాజల్‌వుడ్ నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారానే కమిన్స్ 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ మరీ 36 పరుగులు నమోదు చేయడం బాధాకరమే అయినా...ఇంత అద్భుతమైన బౌలింగ్‌కు ఎలాంటి జట్టయినా తలవంచేది. వారు కూడా ఏ 72 లేదా 80–90 పరుగులు చేసేవారు. మన బ్యాట్స్‌మెన్‌ను విమర్శించడం కంటే ఆసీస్ చాలా బాగా ఆడిందనేది వాస్తవం. –సునీల్ గావస్కర్ -
భారత్ ఘోర పరాజయం
భారత అభిమానులను ఈ సంఖ్య చిరకాలం వెంటాడుతుంది... ఇప్పటి వరకు క్రికెట్లో 36 అంటే మన యువరాజ్ కొట్టిన సిక్సర్ల వర్షం గుర్తుకొచ్చేది... ఇప్పుడు 36 అంటే మరచిపోలేని ఒక పరాభవం... ఆస్ట్రేలియా గడ్డపై ఒక అవమానకర ఓటమి... అడిలైడ్ మైదానంలో ‘పింక్ బాల్ తెచ్చిన పీడకల’... డే అండ్ నైట్ టెస్టు పోరులో చివరకు మనకు మిగిల్చిన చీకటి... ఒకరిని మించి మరొకరు బ్యాట్స్‌మన్ ఉన్న జట్టులో ఒక్కరు కూడా రెండంకెల పరుగులు చేయలేని వేళ... అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కనుమూసి తెరిచేలోపు వికెట్ పడిపోతున్నట్లు అనిపించిన ఆవేదన... ఇంకొద్దిసేపు నిలబడలేరా? ఇంకొన్ని పరుగులు చేయలేరా? అంటూ పెట్టుకుంటున్న ఆశలు క్షణాల వ్యవధిలో మటుమాయం అవుతుండగా చివరకు తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరుకు టీమిండియా దిగజారింది. ఆటలో ఉండే అనిశ్చితే వేరు... ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లగలదు, ఆ వెంటనే అధః పాతాళానికి పడేయగలదు... రెండు రోజుల ఆట తర్వాత టెస్టు గెలుచుకోగలమనే నమ్మకాన్ని కలిగించిన జట్టు కొన్ని గంటల్లోనే ఒక్కసారిగా ఓటమిని నట్టింట్లోకి ఆహ్వానించింది... గంటలకొద్దీ క్రీజ్‌లో గడిపి వందలకొద్దీ పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్ కలిగిన జట్టు ఆట కట్టించేందుకు మూడో రోజు 92 బంతులే సరిపోయాయి... మన జట్టుకు భారీ పరాజయాలు కొత్త కాదు... విదేశీ గడ్డపై ఎన్నో పేలవ ప్రదర్శనలు వచ్చాయి... కానీ ఎప్పుడో 1974 నాటి చెత్త రికార్డును తిరగరాసేంత వైఫల్యం 2020లో ఊహించలేనిది. అయితే ఇలాంటి స్థితిని సృష్టించిన ఆస్ట్రేలియా అద్భుత బౌలింగ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. మన బ్యాటింగ్ లోపాలకంటే హాజల్‌వుడ్, కమిన్స్ చెలరేగిన తీరు ఆస్ట్రేలియాకు అనూహ్య విజయాన్ని అందించిందంటే అతిశయోక్తి కాదు. అడిలైడ్: రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్ హాజల్‌వుడ్ (5/8), ప్యాట్ కమిన్స్ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్ ఓవరాల్ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్ (63 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 5 చక్కటి క్యాచ్‌లు అందుకున్న కెప్టెన్ టిమ్ పైన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఆసీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్టు జరుగుతుంది. టపటపా... మూడో రోజు భారత్ ఆట ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి. ‘నైట్ వాచ్‌మన్’ బుమ్రాను తన తొలి ఓవర్లోనే అవుట్ చేసి కమిన్స్ భారత్ పతనానికి శ్రీకారం చుట్టగా, హాజల్‌వుడ్ తన అద్భుత బౌలింగ్‌తో జట్టు ఆట ముగించాడు. 15 పరుగుల స్కోరు వద్దే భారత్ 4 వికెట్లు కోల్పోయింది. హాజల్‌వుడ్ ఒకే ఓవర్లో మయాంక్, రహానేలను అవుట్ చేయగా... గ్రీన్ చక్కటి క్యాచ్‌కు కోహ్లి నిష్క్రమించాడు. క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలను తాకినట్లు సందేహించిన థర్డ్ అంపైర్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం అవుట్‌గా నిర్ధారించాడు. టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు (26) వద్దే భారత్ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మన జట్టూ ఆ జాబితాలో చేరుతుందేమో అనిపించింది. అయితే దానిని అధిగమించిన భారత్ మరో 10 పరుగులు జోడించి తర్వాతి మూడు వికెట్లు కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో షమీ చేతికి దెబ్బ తగలగా... వైద్యులు స్వల్ప చికిత్స చేసినా ఫలితం లేకపోగా, అతను పెవిలియన్‌కు వచ్చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. వేగంగా... స్వల్ప ఛేదనలో ఆసీస్ చకచకా దూసుకుపోయింది. ముఖ్యంగా బర్న్స్ తన ఆత్మవిశ్వాసం పెంచే ఇన్నింగ్స్ ఆడాడు. స్వల్ప స్కోరు కారణంగా బౌలర్లు కూడా కుంగిపోయారేమో... బుమ్రా, ఉమేశ్‌లలో తొలి ఇన్నింగ్స్ పదును కనిపించలేదు. ఫలితంగా 4.42 రన్‌రేట్‌తో ఆసీస్ పరుగులు సాధించింది. విజయానికి చేరువైన దశలో రెండు వికెట్లు కోల్పోయినా... ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్న్స్, స్మిత్ (1 నాటౌట్) మ్యాచ్‌ను ముగించారు. ఇలా వరుసకట్టి... ఓవర్ 3.1–పృథ్వీ షా (రెండో రోజు): కమిన్స్ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడి లోపలికి దూసుకొచ్చింది. డిఫెన్స్ ఆడటంలో నెమ్మదిగా కదలడంతో క్లీన్‌బౌల్డ్. ఓవర్ 7.6–బుమ్రా (మూడో రోజు): కమిన్స్ బౌలింగ్‌లో నేరుగా దూసుకొచ్చిన స్లో లెగ్కటర్. షాట్ ఆడబోయి బౌలర్ చేతుల్లోకి బంతి. ఓవర్ 11.2–పుజారా: కమిన్స్ కచ్చితమైన లెంగ్త్‌తో వేసిన అద్భుత బంతి. తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి. బ్యాట్‌కు తగులుతూ బంతి కీపర్ చేతుల్లోకి. ఓవర్ 12.1–మయాంక్: హాజల్‌వుడ్ బౌలింగ్‌లో నేరుగా వచ్చిన బంతి. అదనపు బౌన్స్ కారణంగా బ్యాట్‌కు తగిలి కీపర్ క్యాచ్. ఓవర్ 12.5–రహానే: నేరుగా బ్యాట్‌పైకి కచ్చితత్వంలో వచ్చిన హాజల్‌వుడ్ బంతి. బ్యాట్స్‌మన్ కదల్లేని పరిస్థితి. కీపర్‌కు క్యాచ్. ఓవర్ 13.4–కోహ్లి: క్రీజ్‌కు దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం. గల్లీలో క్యాచ్. ఓవర్ 18.4–సాహా: కాస్త భిన్నం. హాజల్‌వుడ్ లెగ్‌స్టంప్‌పై వేసిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో మిడ్వికెట్లో క్యాచ్. ఓవర్ 18.5–అశ్విన్: తొలి బంతికే అవుట్. హాజల్‌వుడ్ గుడ్‌లెంగ్త్‌లో వేయగా ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్. ఓవర్ 20.1–విహారి: స్టంప్స్‌పైకి నేరుగా హాజల్‌వుడ్ బౌలింగ్ చేయగా ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడిన విహారి బ్యాట్‌కు తగులుతూ కీపర్ చేతుల్లోకి. ఓవర్ 21.2–షమీ: కమిన్స్ వేసిన షార్ట్ బాల్‌ను తప్పించుకునే ప్రయత్నంలో చేతికి బలంగా తగిలిన బంతి. ఆడలేని పరిస్థితిలో రిటైర్డ్. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 191; భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) కమిన్స్ 4, మయాంక్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 9, బుమ్రా (సి అండ్ బి) కమిన్స్ 2, పుజారా (సి) పైన్ (బి) కమిన్స్ 0, కోహ్లి (సి) గ్రీన్ (బి) కమిన్స్ 4, రహానే (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 0, విహారి (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 8, సాహా (సి) లబ్‌షేన్ (బి) హాజల్‌వుడ్ 4, అశ్విన్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 0, ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 4, షమీ (రిటైర్డ్ నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (21.2 ఓవర్లలో ఆలౌట్) 36. వికెట్ల పతనం: 1–7, 2–15, 3–15, 4–15, 5–15, 6–19, 7–26, 8–26, 9–31, 9–36. బౌలింగ్: స్టార్క్ 6–3–7–0, కమిన్స్ 10.2–4–21–4, హాజల్‌వుడ్ 5–3–8–5. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వేడ్ (రనౌట్) 33, బర్న్స్ (నాటౌట్) 51, లబ్‌షేన్ (సి) మయాంక్ (బి) అశ్విన్ 6, స్మిత్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–70, 2–82. బౌలింగ్: ఉమేశ్ 8–1–49–0, బుమ్రా 7–1–27–0, అశ్విన్ 6–1–16–1. ‘42’ మ్యాచ్‌లో... 1974లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ కావడం ఇప్పటి వరకు భారత్ అత్యల్ప స్కోరు. ముందుగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగులు చేయగా... భారత్ 302 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు 17 ఓవర్లలో 77 నిమిషాల్లోనే 42 పరుగులకు కుప్పకూలింది. సునీల్ గావస్కర్ (5), గుండప్ప విశ్వనాథ్ (5), బ్రిజేశ్ పటేల్ (1), ఆబిద్ అలీ (3) తదితరులు విఫలమవ్వగా... ఏక్నాథ్ సోల్కర్ (18) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్, 285 పరుగులతో గెలిచింది. -
బూమ్ బూమ్ బ్యాటింగ్
బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత తన బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ‘ఎ’ పతనంలో భాగమయ్యాడు. దీంతో తొలి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. సిడ్నీ: డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2 వికెట్లు) అనూహ్యంగా ఆల్‌రౌండర్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో అజేయంగా రాణించిన అతను భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ను వర్షం ఆటంక పరచడంతో సుమార గంటపాటు మ్యాచ్ సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. షమీ, సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఆల్‌రౌండ్ ప్రాక్టీస్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయినా... పృథ్వీ షా (40; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఇన్నింగ్స్ గతి తప్పింది. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) టపటపా వికెట్లను పారేసుకున్నారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది. అయితే పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా, సిరాజ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా ధాటిగా ఆడాడు. సదర్లాండ్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్సర్‌గా తరలించిన అతను అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాక సిరాజ్ అవుటవ్వడంతో 200 పరుగులకు ముందే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ ‘ఎ’ విలవిల భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ ‘ఎ’ జట్టులో ఎంతో సేపు నిలువలేదు. ఓపెనర్ బర్న్స్ (0)ను బుమ్రా... బెన్ మెక్‌డెర్మట్ (0)ను షమీ ఖాతానే తెరవనీయలేదు. మరో ఓపెనర్ హారిస్ (26; 4 ఫోర్లు) కాసేపు, కెప్టెన్ క్యారీ కాసేపు ఆడినా... వాళ్లిద్దరిని అవుట్ చేసేందుకు భారత సీమర్లకు ఎంతో సేపు పట్టలేదు. దీంతో 56 పరుగులకే ఐదు వికెట్లను... వందకంటే ముందే 9 వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది. కోహ్లి దూరం 12 రోజుల వ్యవధిలో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఊహించిన విధంగానే ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆడకపోయినా...సిడ్నీ ప్రధాన స్టేడియం బయట నెట్స్‌లో కోహ్లి సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. అనూహ్యంగా భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. అయితే ఇందులో సీనియర్ ఉమేశ్ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సదర్లాండ్ 40; మయాంక్ (సి) బర్న్స్ (బి) అబాట్ 2; శుబ్‌మన్ (సి) క్యారీ (బి) గ్రీన్ 43; విహారి (బి) విల్డర్మత్ 15; రహానే (సి) క్యారీ (బి) విల్డర్మత్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్డర్మత్ 5; సాహా (సి)సదర్లాండ్ (బి) అబాట్ 0; సైనీ (సి) మ్యాడిన్సన్ (బి) కాన్వే 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; బుమ్రా నాటౌట్ 55; సిరాజ్ (సి) హరిస్ (బి) స్వెప్సన్ 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194. బౌలింగ్: అబాట్ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్లాండ్ 9–0–54–1, గ్రీన్ 6.1–2–20–1, విల్డర్మత్ 8–4–13–3, స్వెప్సన్ 2.2–0–15–1. ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) శుబ్‌మన్ (బి) షమీ 26; బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మ్యాడిన్సన్ (సి) సాహా (బి) సిరాజ్ 19; మెక్‌డెర్మట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; క్యారీ (సి) పంత్ (బి) సైనీ 32; అబాట్ (సి) పంత్ (బి) షమీ 0; విల్డర్మత్ (సి) పంత్ (బి) బుమ్రా 12; సదర్లాండ్ (సి) శుబ్‌మన్ (బి) సైనీ 0; ప్యాట్రిక్ నాటౌట్ 7; స్వెప్సన్ (సి) సాహా (బి) సైనీ 1; కాన్వే రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108. బౌలింగ్: షమీ 11–4–29–3; బుమ్రా 9–0–33–2, సిరాజ్ 7–1–26–1, సైనీ 5.2–0–19–3. గ్రీన్ దిమ్మదిరిగింది టెస్టు సిరీస్‌కు ముందు అసలే గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బుమ్రా... ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బుర్ర బద్దలయ్యే షాట్ ఆడాడు. గ్రీన్ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ తలకు బలంగా తగిలింది. దీంతో గ్రీన్ ఒక్కసారిగా పిచ్‌పైనే కూలబడ్డాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును, బ్యాట్‌ను పక్కన పడేసి గ్రీన్ వద్దకు పరుగెత్తాడు. ఆసీస్ జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లి పరీక్షించింది. అతని స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా బ్యాట్స్‌మన్ ప్యాట్రిక్ రోవ్‌ను బరిలోకి దిగాడు. -
‘పింక్’ పిలుపు...
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లు మొదలయ్యాక భారత జట్టు గులాబీ బంతితో ఒకే ఒక మ్యాచ్ (2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో) ఆడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వచ్చే గురువారం నుంచి మరో ‘పింక్’ పోరులో తలపడాల్సి ఉంది. దానికి సిద్ధమయ్యేందుకు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్‌తో పోలిస్తే పిచ్‌లో తేడా ఉన్నా... ఫ్లడ్‌లైట్లలో, పింక్ బాల్‌తో ఆడటం అసలు సమరానికి ముందు సరైన సన్నాహకంగా భావించవచ్చు. సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ వనరులను మరింతగా పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఆస్ట్రేలియా ‘ఎ’తో నేటి నుంచి జరిగే ఈ మూడు రోజుల మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మినహా భారత టెస్టు జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లంతా ఆడే అవకాశం ఉంది. 12 రోజుల వ్యవధిలో వన్డే, టి20 సిరీస్‌లు ఆడటంతో అలసిపోయినట్లు భావిస్తున్న కెప్టెన్ తొలి టెస్టుకు ముందు తగినంత విశ్రాంతి కోరుకుంటున్నాడు. బరిలోకి విహారి... కోహ్లి జట్టులోకి రావడం మినహా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే బృందమే తొలి టెస్టులోనూ బరిలోకి దిగే అవకాశం దాదాపు ఖాయమే. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడని రెగ్యులర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఇక్కడ తన బ్యాటింగ్ పదును పరీక్షించుకోవాల్సి ఉంది. రెండో ఓపెనర్‌గా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుందా లేక పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ప్రయత్నిస్తారా ఇక్కడ తేలిపోతుంది. పుజారా, రహానేలు మరింత ప్రాక్టీస్ ఆశిస్తుండగా ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారిపై కూడా అందరి దృష్టి ఉంది. తొలి టెస్టులో భారత్ నలుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడాలని భావిస్తే ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా విహారికి అవకాశం దక్కుతుంది. అతనికి ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే కుల్దీప్ను ఆడించాల్సి ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్‌లో కుల్దీప్ వైవిధ్యమైన బౌలింగ్ అదనపు బలంగా మారుతుందనుకుంటే అతనికీ తగినంత ప్రాక్టీస్ అవసరం. ఇషాంత్ లేకపోవడంతో షమీ, బుమ్రాలపై మరింత బాధ్యత పెరిగింది. టి20లకు దూరంగా ఉండి వీరు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి పింక్ బంతితో ఆసీస్ పిచ్‌పై సాధ్యమైనంత ప్రాక్టీస్‌ను కోరుకుంటున్నారు. వికెట్ కీపర్‌గా సాహా తొలి మ్యాచ్‌లో సత్తా చాటగా... ఇప్పుడు అతడినే కొనసాగిస్తారా లేక రిషభ్ పంత్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తారా చూడాలి. సత్తా చాటేందుకు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు. టెస్టు ఓపెనర్‌గా ఖాయమైన జో బర్న్స్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రదర్శనతో టెస్టు తుది జట్టులో స్థానం ఆశిస్తున్న కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, మిషెల్ స్వెప్సన్ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా గ్రీన్ ఇక్కడ చెలరేగితే టెస్టు క్రికెటర్‌గా ప్రమోషన్ దక్కవచ్చు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో టెస్టులు ఆడిన నిక్ మ్యాడిసన్, మార్కస్ హారిస్ కూడా సొంత మైదానంలో సత్తా చాటగలరు. గాయంతో మోజెస్ హెన్రిక్స్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫస్ట్ క్లాస్ హోదా ఉంటేనే... సరిగ్గా తొలి టెస్టు ఆడే జట్టుతోనే ప్రాక్టీస్ చేయాలని భారత్ భావిస్తే (కోహ్లి మినహా) ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా ఇవ్వాలని ఆతిథ్య బోర్డును కోరవచ్చు. అప్పుడు మ్యాచ్‌లో తీవ్రత పెరుగుతుంది. పూర్తి స్థాయిలో 11 మంది తుది జట్టునే బరిలోకి దించాల్సి ఉంటుంది. లేదంటే మామూలు టూర్ మ్యాచ్‌లాగానే ఎవరైనా గరిష్టంగా 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్ చేస్తూ దాదాపు అందరు ఆటగాళ్లను పరీక్షించుకోవచ్చు. సాధారణంగా పర్యాటక జట్టు విజ్ఞప్తి చేస్తేనే ఆతిథ్య బోర్డు స్పందిస్తుంది. -
ఇంటా బయట గులాబీ బాట!
న్యూఢిల్లీ: భారత క్రికెట్లో ఇకపై డే–నైట్ టెస్టులు తరచూ జరిగే అవకాశాలున్నాయి. అందరికంటే ఆలస్యంగా ‘పింక్’ బాల్ టెస్టు ఆడిన భారత్ వచ్చే సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. విదేశాల్లో తొలి డే–నైట్ టెస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పచ్చజెండా ఊపింది. ఆదివారం బీసీసీఐ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పింక్ బాల్ టెస్టులు, భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ), సభ్య సంఘాలకు నిధుల విడుదల అంశాలపైనే చర్చించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఒకటి... అలాగే స్వదేశంలో మరొక ‘గులాబీ’ బంతులాట ఆడేందుకు బోర్డు ‘సై’ అంటోంది. (నయా పోస్ట్... సుందర్ దోస్త్... ) భారత పర్యటనకు వచ్చే ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మితమైన, ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతెరా మైదానంలో డేనైట్ మ్యాచ్ నిర్వహించనుంది. అంతకంటే ముందు భారత్ 2020–21 సీజన్లో ఆసీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన షెడ్యూల్ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎర్ల్ ఎడింగ్స్ గత నెల భారత్‌కు వచ్చి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో సమావేశమయ్యారు. తమ పర్యటనలో రెండు డే–నైట్ టెస్టులు ఆడాలని కోరగా గంగూలీ మాత్రం ఒకదానికే మొగ్గుచూపారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పెర్త్ లేదంటే అడిలైడ్ మైదానంలో డే–నైట్ టెస్టు మ్యాచ్ జరిగే అవకాశముంది. (మయాంక్, పంత్ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్’) ఆసీస్‌లో ‘పింక్ బాల్’ టెస్టు ఖరారైందని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని గంగూలీ తెలిపారు. ఆటగాళ్ల శ్రేయస్సు కోసం ఏర్పాటైన ఐసీఏ సంస్థాగత నిర్మాణం కోసం బోర్డు రూ. 2 కోట్లు మంజూరు చేసింది. అలాగే వివిధ రాష్ట్ర సంఘాలకు ప్రకటించిన నిధుల్ని కూడా విడుదల చేయాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. మే చివరి వారంలో ఐపీఎల్ ముగిశాక శ్రీలంకలో భారత్ పర్యటించనుందని బీసీసీఐ తెలిపింది. శ్రీలంకలో భారత్ మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. -
పింక్ హుషార్
భారత్‌లో జరిగే తొలి డేనైట్ టెస్టుకు ముందు జరుగుతోన్న పింక్ సందడి అంతాఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్ వేదికనే గులాబీ రేకులతో పరిచేసినట్టుగా ఉందీమాయ. ఇది కొత్తేమీ కాదు. ఈపాటికే ప్రపంచం (మిగతా జట్లు) ఆడిన ఆటే! అయితే అప్పుడు చడీచప్పుడులేదు. కానీ ఇప్పుడు... భారత్ ఆడుతోందంటే మాత్రం ప్రపంచమే ఆడినంత సంబరంగా ఉంది. మన జాతీయ పతాకం మువ్వన్నెలతో మురిసిపోయినట్లుగా మన టెస్టు గులాబీ వన్నెలద్దుకుంటున్న వేళ వచ్చేసింది. భారత్ ‘పింక్’ హుషార్లో ఉంది. క్రికెట్ అభిమానులంతా డే నైట్ టెస్టుపై ఎనలేని ఆసక్తి పెంచుకున్నారు. ఈ మ్యాచ్ ఆడే క్రికెటర్లే కాదు మాజీలు, దిగ్గజాలు సైతం పింక్ బాల్ టెస్టుపైనే చర్చించుకుంటున్నారు. వ్యాఖ్యాతలు కూడా ఈ మ్యాచ్ గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక భారత గడ్డపై కొంగొత్త ఆటకు వేదికైన కోల్‌కతా మాత్రం గులాబీమయమైంది. ఈడెన్ గార్డెన్స్ పింక్ షో చూపించేందుకు కొత్త సొబగులు అద్దుకుంది. రహానే కళ్లలో గులాబీ కలలే.. భారత్‌లో చారిత్రక డేనైట్ టెస్టుపై కలలు కంటున్నానని వైస్ కెప్టెన్ రహానే చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి అతను జత చేసిన ఫొటో తెగ వైరల్ అయ్యింది. లైక్‌ల మీద లైక్‌లు పోటెత్తుతున్నాయి. తన తలగడ వద్ద గులాబీ బంతిని పెట్టుకొని నిద్రిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పెట్టిన రహానే ‘ఇప్పటికే ఆ టెస్టు కలల్లో మునిగిపోయాను’ అని ట్వీట్ చేశాడు. ఇది ఆ టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రేక్షకుల సంఖ్య ను అమాంతం పెంచేసింది. సోషల్ మీడి యాలో ‘పింక్’ ఫీవర్ ఎక్కించిన రహానేను భారత కెప్టెన్ కోహ్లి అనుసరించాడు. ‘నైస్ పోజ్ జింక్స్’ అంటూ ట్వీటాడు. కలల్లో మునిగిపోయిన ఫొటో తనకు బాగా నచ్చిందంటూ స్పందించాడు. అతనికి ఓపెనర్ ధావన్ కూడా జత కలిశాడు. ‘ఆ కలలోనే ఫొటో దిగావా ఏంటీ’ అని పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు. పింక్ టీ షర్ట్లతో స్వాగతం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో భారత ఆటగాళ్ల కోసం ఆతృతగా ఎదురుచూసిన అభిమానులు పింక్ టీ షర్ట్లతో స్వాగతం పలికారు. దీంతో ఎయిర్పోర్ట్ గులాబీ టీషర్ట్‌లతో సందడి సందడిగా మారింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే విమానంలో వచ్చారు. మంగళవారం భారత కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రహానే ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇలాంటి వాతావరణం ఎదురైంది. ఆటగాళ్లంతా అక్కడి నుంచి బస చేసే హోటల్ గదులకు వెళ్లిపోయారు. భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బంగ్లా కోచ్ రసెల్ డొమింగోలు ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలించేందుకు వెళ్తారని బోర్డు మీడియా మేనేజర్ వెల్లడించారు. స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, పేసర్లు షమీ, ఉమేశ్‌లు బుధవారం జట్టుతో కలుస్తారని ఆయన తెలిపారు. మంగళవారం ఆటగాళ్లెవరూ ప్రాక్టీస్ చేయలేదు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. సౌకర్యాలు మెరుగుపరిస్తే... భారత్‌లో టెస్టు క్రికెట్ బతికేందుకు కొత్త తరహా డే నైట్ టెస్టులతో పాటు మైదానానికి వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాల్ని మెరుగుపరచాల్సిన అవసరం ఎంతో ఉందని దిగ్గజ బ్యాట్స్‌మన్, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ‘ఏదో పింక్ బాల్ టెస్టుతో జనం ఎగబడతారనుకుంటే పొరపాటు. వాళ్లకు సౌకర్యాలు కల్పించాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, మంచి సీట్లు, కార్లకు పార్కింగ్ లాంటి అవసరాల్ని తీర్చాలి. అలాగే కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను అమలు చేయాలి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో టెస్టులను ఆదరించేందుకు ఎన్నో కారణాలున్నాయి. బాక్సింగ్ డే టెస్టు, కచ్చితంగా జూలైలో లార్డ్స్ టెస్టు ఇలాంటివన్నీ పక్కా ప్రణాళికతో జరిగేవి. అందుకే యాషెస్ సిరీస్ ఇప్పటికీ ప్రభ కోల్పోకుండా విరాజిల్లుతోంది. భారత్‌లో కూడా కచ్చితమైన టెస్టు క్యాలెండర్‌ను జతచేస్తే ప్రయోజనం ఉంటుంది’ అని ద్రవిడ్ వివరించాడు. ఒకప్పుడు ఈడెన్‌లో లక్ష మంది మ్యాచ్ చూసేవారని ఇప్పుడా పరిస్థితి లేదన్నాడు. అలాగే డిజిటల్ మీడియా, హెచ్డీ టీవీల రాకతో మైదానానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పాడు. పింక్ బాల్‌కు వారం పడుతుంది పింక్ బాల్ తయారయ్యేందుకు ఏడెనిమిది రోజుల సమయం పడుతుంది. దీని కోసం ప్రత్యేకించి గులాబీ రంగు వేసిన లెదర్‌ను వినియోగిస్తారు. ఇది హార్డ్‌గా మారకుండా సాఫ్ట్‌గా ఉండేలా చూస్తారు. రెండు సగం కప్పులు తయారయ్యాక దాన్ని ఒక గోళాకారంగా చేతితో కుట్లు వేస్తారు. అనంతరం మళ్లీ గులాబీ రంగు వేస్తారు. ఇది రివర్స్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని, షమీ లాంటి బౌలర్‌కు ఆయుధంగా మారుతుందని భారత వర్గాలు భావిస్తున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా... చారిత్రక డేనైట్ టెస్టు చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తనున్నారు. ఐదు రోజుల మ్యాచ్‌లో మొదటి నాలుగు రోజుల టికెట్లన్నీ అయిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. పింక్ బాల్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారని చెప్పారు. ‘నాలుగు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఈ స్థాయిలో విక్రయం జరగడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 67 వేల సీట్ల సామర్థ్యమున్న ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 22 నుంచి డేనైట్ టెస్టు జరుగుతుంది -
తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కు అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్లో నవంబర్ 22 నుంచి 26 వరకు ఈ మ్యాచ్ జరుగనుంది. తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌కు రావాల్సిందిగా.. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) ప్రధాని మోదీని, అమిత్ షాను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి షా సానుకూలంగా స్పందించారని.. తొలి డే అండ్ టెస్ట్ మ్యాచ్‌కు హాజరవుతారని క్యాబ్ కార్యదర్శి అవిషేక్ దాల్మియా తెలిపారు. కాగా ఈడెన్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనాతో పాటు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్తో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని కూడా హాజరుకానున్నారు. కాగా కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇదివరకే వెల్లడించాడు. -
కోల్‌కతాలోనే తొలి డే నైట్ టెస్టు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆలోచన కార్యరూపం దాల్చనుంది. ఇక భారత్‌లో టెస్టు క్రికెట్ కొత్త ‘కాంతు’లీననుంది. సంప్రదాయ ఆటను ఇన్నాళ్లు పగటిపూటే చూశాం.ఇప్పుడు రాత్రి కూడా వీక్షించనున్నాం. భారత్ ఆడబోయే, భారత్‌లో జరగబోయే తొలి డేనైట్ టెస్టుకు గంగూలీ సొంత నగరం కోల్‌కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక కానుండటం మరో విశేషం.ఈ మేరకు గంగూలీ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. భారత్‌తో డే నైట్ టెస్టు ఆడేందుకు తాము సిద్ధమేనని ప్రకటించింది. ఫలితంగా వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్ ఖాతాలో తొలి డే నైట్ టెస్టు చేరనుంది. కోల్‌కతా: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఎప్పుడో డే నైట్ టెస్టులు ఆడేశాయి. కానీ టెస్టుల్లో నంబర్‌వన్ జట్టు భారత్ మాత్రం ఇప్పటిదాకా ఫ్లడ్‌లైట్ల మధ్య ఐదు రోజుల ఆట ఆడలేదు. ఇప్పుడు టీమిండియా కూడా రూటు మార్చుకుంది. డే నైట్‌కు సై అంది. దీంతో వచ్చే నెలలోనే భారత గడ్డపై కోహ్లి సేన ఆడే డే నైట్ టెస్టును ఎంచక్కా చూసేయొచ్చు. ఇదంతా బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంకల్పం వల్లే సాకారమవుతోంది. అతను అధ్యక్షుడే... కానీ 9 నెలలే ఆ పదవిలో ఉంటాడు. అందుకేనేమో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే నాయకుడు కోహ్లిని ‘పింక్‌బాల్ క్రికెట్’కు ఒప్పించడంతోనే తన పట్టుదల ఏపాటిదో చేతల ద్వారా చెప్పకనే చెప్పాడు. ఆ వెంటే బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తోనూ సంప్రదింపులు మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు కోరితే ఎవరు మాత్రం కాదంటారు! అందుకనే బీసీబీ కూడా సై అంది. భారత క్రికెట్లో ఈడెన్ గార్డెన్స్‌కు విశేషమైన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్రలో మరో పేజీ పింక్‌బాల్‌తో జత కాబోతోంది. నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ‘బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు సై అన్న కెప్టెన్ కోహ్లికి కూడా థ్యాంక్స్’ అని గంగూలీ అన్నాడు. నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్లో పింక్‌బాల్ క్రికెట్ ఆడించాలని అప్పటి క్రికెట్ కమిటీ చైర్మన్ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. అతని ప్రతిపాదన వల్లే దులీప్ ట్రోఫీలో వరుసగా 2016–17, 2017–18, 2018–19 మూడు సీజన్లు డేనైట్ ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఈ సీజన్లో మళ్లీ పాత పద్ధతినే అవలంభించి ఎర్ర బంతితో మ్యాచ్‌లను నిర్వహించారు. కోల్‌కతా డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ఆట మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుందని... 68 వేల సామర్థ్యమున్న స్టేడియంలో టికెట్ల ధరను కనిష్టంగా రూ. 50 నుంచి విక్రయిస్తామని ‘క్యాబ్’ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపాడు. ఈ నాలుగేళ్లలో పదకొండే! డే నైట్ టెస్టు ముచ్చట ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితమే 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పింక్‌బాల్ మ్యాచ్ జరిగింది. కానీ ఈ నాలుగేళ్లలో కేవలం 11 మ్యాచ్‌లే జరిగాయి. అయితే అన్నింట్లోనూ ఫలితాలు వచ్చాయి. -
నా సొంత మైదానంలోనే ఆ మ్యాచ్: గంగూలీ
కోల్‌కతా: డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై చాలా కాలంగా తన ఆసక్తిని ప్రదర్శించిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు బోర్డు అధ్యక్ష హోదాలో దానికి కార్యరూపం ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాడు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత పలు మార్లు గులాబీ బంతితో టెస్టు నిర్వహణ గురించి సౌరవ్ వ్యాఖ్యానించడంతోనే పరోక్షంగా అతని ఆలోచన అర్థమైంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో భారత్ ఆడే రెండో టెస్టును డే అండ్ నైట్‌గా నిర్వహించాలని తాము భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. తన సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుందని స్వయంగా దీనిని నిర్ధారించిన సౌరవ్... మీ అభిప్రాయం చెప్పాలంటూ బంగ్లాదేశ్ బోర్డును కోరాడు. నవంబర్ 22 నుంచి 26 వరకు ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ‘నేను బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌తో మాట్లాడాను. వాళ్లు దాదాపుగా అంగీకరించారు. అయితే తమ ఆటగాళ్లతో మాట్లాడాల్సి ఉందని నాతో చెప్పారు. ఇది కచ్చితంగా డే అండ్ నైట్ మ్యాచ్ అవుతుందని నేను నమ్ముతున్నా. వారు వీలైనంత తొందరగా తమ అధికారిక ప్రకటన చేస్తారు. ఒక్కసారి బంగ్లా బోర్డు నుంచి సమాధానం వస్తే మేం టెస్టు నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలు పెడతాం’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. భారత్‌లాగే బంగ్లాదేశ్ కూడా ఇప్పటి వరకు ఒక్క డే అండ్ నైట్ టెస్టు కూడా ఆడలేదు. తమకు గులాబీ బంతితో ఏ మాత్రం అనుభవం లేదనేది ఆ జట్టు ఆటగాళ్ల భావన. ఒలింపియన్లకు సన్మానం... కోల్‌కతా టెస్టు సందర్భంగా షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ పీవీ సింధు తదితర ఒలింపియన్లను ఘనంగా సన్మానించనున్నట్లు సౌరవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్న జేన్ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం ప్రతీ ఏటా ‘పింక్ టెస్టు’ను నిర్వహిస్తారు. అదే తరహాలో ఈడెన్ గార్డెన్స్ మ్యాచ్ కూడా ప్రతీ సంవత్సరం సాగే వేడుక కావాలని తాను కోరుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మనసులో మాట చెప్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు కాంట్రాక్టులు... మరోవైపు తొలిసారి ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు గంగూలీ ప్రకటించాడు. బోర్డు కొత్త ఫైనాన్స్ కమిటీ దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తుందని అతను చెప్పాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెటర్లు ఏడాదికి తాము ఆడే మ్యాచ్‌ల సంఖ్యను బట్టి రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. -
‘పింక్ బాల్’ ఎందుకు గుచ్చుకుంటోంది!
అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) అంటే భారత్ ఒకప్పుడు ఆమడ దూరం పరుగెత్తింది. ‘మేం ఉపయోగించం. ఏం చేసుకుంటారో పొమ్మంటూ’ ఐసీసీకి సవాల్ విసిరింది. డోపింగ్ పరీక్షలు నిర్వహించే ‘వాడా’ పరిధిలో ఇతర దేశాల క్రికెటర్లంతా ఉండగా, మేం మాత్రం సొంతంగా నిర్వహించుకుంటాం తప్ప అందరితో కలిసేది లేదని బీసీసీఐ కరాఖండీగా చెప్పింది. ఇటీవల ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కూడా తగిన కారణం చెప్పి తమ నిర్ణయంపై స్పష్టత ఇవ్వడంకంటే బీసీసీఐ ఆధిపత్య ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. డే అండ్ నైట్ టెస్టుల విషయంలోనూ ఇప్పటి వరకు అదే తీరు. మిగతా ప్రధాన టెస్టు జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడగా, భారత్ మాత్రం తమ పట్టు విడవలేదు. బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఈ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో టీమిండియా తొలి గులాబీ మ్యాచ్ త్వరలోనే జరుగుతుందా? డీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సమయంలో భారత్–శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో దీనిని ఒకసారి ఉపయోగించారు. అయితే నిర్ణయాలు అన్నీ తమకు ప్రతికూలంగా వెళ్లడంతో ఇకపై వాడేది లేదన్న బీసీసీఐ... డీఆర్ఎస్ లోపాలభరితం అని తేల్చేసింది. సాంకేతికంగా చెప్పుకోవడానికైనా భారత్ ఒక సిరీస్‌లో డీఆర్ఎస్ ఉపయోగించిన తర్వాత తమ అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచింది. కానీ డే అండ్ నైట్ టెస్టు విషయంలో కనీసం అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. మొదటి నుంచి మాకు సరిపోదు అంటూ దాటవేస్తూ వచ్చింది. గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో తమ దేశంలో జరిగిన సిరీస్‌లో ఒక టెస్టును ‘పింక్ బాల్’తో ఆడదామని కోరితే భారత్ ఏకవాక్యంతో గట్టిగా తిరస్కరించేసింది. ఇతర దేశాలన్నింటికీ పనికొచ్చిన గులాబీ బంతి టెస్టు మ్యాచ్ టీమిండియాకు వచ్చేసరికి మాత్రం తగనిదిగా మారిపోయింది. దులీప్ ట్రోఫీకే పరిమితం... ప్రపంచ క్రికెట్లో గులాబీ బంతితో ‘డే అండ్ నైట్’ టెస్టుల నిర్వహణ గురించి చర్చ జరుగుతున్న సమయంలో భారత్ తమ దేశవాళీ క్రికెట్లో వాడి చూడాలని భావించింది. 2015 డిసెంబర్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగ్గా... 2016 సీజన్ దులీప్ ట్రోఫీలో భారత్ మొదటిసారి గులాబీ బంతిని వాడింది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా డే అండ్ నైట్ మ్యాచ్‌లను కొనసాగిస్తూ ఫ్లడ్‌లైట్లలో ఆటను నిర్వహించింది. దేశవాళీలో సక్సెస్ అయితే టెస్టు క్రికెట్లో ప్రయత్నించవచ్చని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్ కారణంగా లేదా అనాసక్తి వల్ల కూడా భారత టెస్టు జట్టు రెగ్యులర్ ఆటగాళ్లు ఇందులో ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు. దాంతో ఆ మ్యాచ్ అనుభవం గురించి కానీ, గులాబీ బంతి స్పందించే తీరును గురించి కూడా మన ప్రధాన ఆటగాళ్లకు అవగాహనే రాలేదు. కోహ్లి, పుజారాలాంటి బ్యాట్స్‌మెన్... బుమ్రా, అశ్విన్‌లాంటి బౌలర్లు ఒక్కసారైనా వాడి ఉంటే ముందడుగు పడేదేమో. ఒక్క మ్యాచ్‌లో కూడా గులాబీ బంతిని వాడకుండా నేరుగా టెస్టు బరిలోకి దిగడం సాధ్యం కాదని టీమిండియా ఆ తర్వాత ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పడేసింది. ఈ సారి అవుట్... 2019 దులీప్ ట్రోఫీ సమయంలో బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సారి లీగ్ మ్యాచ్‌లన్నీ పాత పద్ధతిలోనే ఎర్ర బంతితోనే జరుగుతాయని, ఫైనల్ మాత్రం పింక్ బాల్‌తో డే అండ్ నైట్‌గా ఉంటుందని ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఫైనల్ మ్యాచ్‌ను కూడా ‘పింక్’ కాకుండా సాంప్రదాయ ఎర్ర బంతితోనే ఆడించింది. మూడు సీజన్ల అనుభవం తర్వాత ఇక ఇది తమకు పనికి రాదని బోర్డు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు దీని ద్వారా పరోక్షంగా అర్థమైంది. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా టెస్టుల్లో మన జట్టులో పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదు. అయితే మూడు సీజన్లు ఆడించినా... దృశ్యానుభూతి విషయంలో ప్రేక్షకులనుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ చేయకపోవడం విశేషం. ఇప్పుడు ఎందుకు... ప్రేక్షకులను స్టేడియానికి ఆకర్షించే అంశంలో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఘోరంగా విఫలమైంది. ఉచిత పాస్‌లు ఇవ్వడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీసుకురావడంవంటివి చేసినా మూడు వేదికల్లోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ముఖ్యంగా పుణేలో అయితే సగంకంటే ఎక్కువ స్టేడియానికి పై కప్పు లేకపోవడంతో ఎండ దెబ్బకు ఎవ్వరూ మ్యాచ్ వైపు కూడా చూడలేదు. ఇలాంటి ప్రేక్షకులను సాయంత్రం వేళ జరిగే డే అండ్ నైట్ టెస్టులు కొంత ఆకర్షించవచ్చు. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే ఈ తరహాలో ఏదైనా చేయాలనేది మొదటినుంచి గంగూలీ ఆలోచన. 1877లో తొలి టెస్టు మ్యాచ్ జరిగిన తర్వాత క్రికెట్ ఎన్నో రకాలుగా స్వరూపం మార్చుకుంది. ఎన్నో కొత్త అంశాలు వచ్చి చేరాయి. కాబట్టి పింక్ బాల్, ఫ్లడ్ లైట్ టెస్టు క్రికెట్ అనేది కూడా ఒక కొత్త ఆకర్షణ కాబట్టి ప్రయత్నిస్తే తప్పేంటనేది చాలా మంది వాదన. సహజంగానే ఇది అభిమానులకు కొత్త అనుభూతి ఇస్తుంది కాబట్టి ఐపీఎల్ తరహాలో సరదాగా సాయంత్రం గడిపేందుకు బాగుంటుందని సౌరవ్ భావిస్తున్నాడు. మ్యాచ్ సాధ్యమేనా! విదేశీ పర్యటనల్లో డే అండ్ టెస్టు గురించి ఇప్పుడే చెప్పలేం కానీ గంగూలీ స్వదేశంలోనైనా ఒక మ్యాచ్ ఆడించాలని పట్టుదలగా ఉన్నాడు. బహిరంగంగా చెప్పకపోయినా బోర్డు అధ్యక్షుడి వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లోనే ఒక టెస్టు విషయంలో అతను ఈ ఆలోచనతో ఉన్నట్లు అంతర్గత సమాచారం. బహుశా తన సొంత మైదానం కోల్‌కతాలో జరిగే రెండో టెస్టే పింక్ బాల్ మ్యాచ్ కావచ్చని కూడా వినిపిస్తోంది. భారత్‌తో పోలిస్తే బంగ్లా బలహీనమైన జట్టు కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పింక్ బంతి కారణంగా ఒక వేళ మ్యాచ్ గమనం భారత్‌కు ప్రతికూలంగా మారినా దానిని ఎదుర్కోగల సత్తా టీమిండియాకు ఉందని మాజీ కెప్టెన్ భావిస్తున్నాడు. ఈ విషయాన్ని కోహ్లితో చర్చించిన తర్వాతే దీనిపై అతను వ్యాఖ్య చేసినట్లు సమాచారం. మరోవైపు పింక్ బాల్‌తో టెస్టు నిర్వహణకు మద్దతిచ్చిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే... ఈ విషయంలో వాతావరణం, వేదిక, మ్యాచ్ జరిగే రోజులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నాడు. మంచు కారణంగా రాత్రి పూట బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోతే మొత్తం సమస్యగా మారిపోతుందని అభిప్రాయపడ్డాడు. బంతులతోనే సమస్య! దులీప్ ట్రోఫీలో ఆడిన అనేక మంది పింక్ బాల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే బోర్డు మరింత ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియాలో ‘కూకాబుర్రా’ బంతులు, ఇంగ్లండ్ లో ‘డ్యూక్’ బంతులు వాడతారు. ఈ రెండు దేశాల్లో వాడిన గులాబీ బంతులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. భారత్‌లో టెస్టులతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు ‘ఎస్జీ’ బంతులు ఉపయోగిస్తారు. ‘ఎస్జీ’ గులాబీ బంతులు ఏ మాత్రం నాణ్యతతో లేవని ఆటగాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఇతర టెస్టు దేశాల్లో ఫ్లడ్‌లైట్లు వాడినప్పుడు బంతి బాగా స్వింగ్ అయింది. కానీ మన వద్దకు వచ్చేసరికి అది జరగలేదు. పైగా బౌలర్లకు పింక్ బాల్స్ ఏమాత్రం అనుకూలంగా లేవు. తొలి స్పెల్ వేసిన తర్వాత ఇక బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. పది ఓవర్లకే సీమ్ పాడైపోతోంది. రివర్స్ స్వింగ్ కాకపోగా, స్పిన్నర్లకు కూడా పట్టు చిక్కడం లేదు’ అని విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ అన్నాడు. ఒక భారత అంపైర్ అభిప్రాయం ప్రకారం ‘దులీప్ ట్రోఫీలో ఉపయోగించిన బంతులపై వాడిన లక్క మరీ నాసిరకంగా ఉంది. అది చెదిరిపోయి బంతి నల్లగా మారిపోతోంది. ఫలితంగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో బ్యాట్స్‌మెన్‌కు అది కనిపించడం లేదు’ అని మరో కారణం వెల్లడించారు. అయితే ఇది పరిష్కరించుకోదగ్గ సమస్యే అని, నాణ్యత విషయంలో కంపెనీలకు తగు సూచనలు ఇచ్చి మంచి బంతులు తయారు చేయించుకోగలమని బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీమ్ వ్యాఖ్యానించారు. 11 - ఇప్పటి వరకు పురుషుల క్రికెట్లో జరిగిన డే నైట్ టెస్టుల సంఖ్య. అన్నింటా ఫలితాలు వచ్చాయి. భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా అన్ని జట్లు ఇప్పటికే డే నైట్ టెస్టులు ఆడాయి. ఇందులో ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు మ్యాచ్‌లు ఆడి, ఐదింటా విజయం సాధించింది. శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కోమ్యాచ్లో గెలిచాయి. -
డే అండ్ నైట్ టెస్టులపై బీసీసీఐ యూటర్న్
న్యూఢిల్లీ: గతంలో పింక్ బాల్ టెస్టుల కోసం సూత్రప్రాయ అంగీకారం తెలిపిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది ఆసీస్ పర్యటన సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్ట్ నిర్వహించాలనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. అంతే కాకుండా అక్టోబర్‌లో రాజ్‌కోట్ వేదికగా భారత్-వెస్టిండీస్ డే అండ్ నైట్ టెస్ట్ ప్రయత్నాన్ని కూడా బీసీసీఐ విరమించుకుంది. త్వరలో జరగబోయే టెస్టు చాంపియన్‌షిప్‌లో డే అండ్ నైట్ టెస్టును ఐసీసీ చేర్చలేనప్పుడు.. ఆ ఫార్మాట్లో ఆడడం వల్ల ప్రయోజనం లేదని బీసీసీఐ భావిస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి. దాంతోనే పింక్ బాల్ టెస్టుపై బీసీసీఐ విముఖత వ్యక్తం చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
పాక్ క్రికెటర్ అరుదైన ఫీట్
దుబాయ్: పాకిస్తాన్ తమ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ ప్లేయర్ అజహర్ అలీ అరుదైన రికార్డును నమోదుచేశాడు. కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న అజహర్ అలీ డబుల్ సెంచరీ(208 నాటౌట్: 19 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు. దీంతో డే అండ్ నైట్ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్ నెలకొల్పాడు. నిన్న (గురువారం) తొలి సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన అజహర్ అలీ.. తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు. ఇన్నింగ్స్ 121 ఓవర్లో విండీస్ బౌలర్ గాబ్రియెల్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి డబుల్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 24 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ చేసిన పాక్ ఓపెనర్ గా అజహర్ అలీ నిలిచాడు. 1992లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో పాక్ ఓపెనర్ ఆమర్ సోహైల్ ద్విశతకం చేశాడు. సమీ అస్లామ్(90), అసద్ షఫీఖ్(67) రాణించారు. డబుల్ సెంచరీ వీరుడు అజహర్ అలీకి తోడుగా బాబర్ అజామ్(30 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. 124 ఓవర్లు ముగిసేసరికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 412 పరుగులు చేసింది. -
పాకిస్తాన్ జోరు
దుబాయ్: పాకిస్తాన్ తమ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో ఇక్కడ గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో కడపటి వార్తలందే సరికి పాక్ 68 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు చేసింది. కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న అజహర్ అలీ (200 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు) డే అండ్ నైట్ టెస్టుల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మరో ఓపెనర్ సమీ అస్లామ్ (212 బంతుల్లో 90; 9 ఫోర్లు) సెంచరీ కోల్పోయాడు. ఇరు జట్లకూ గులాబీ బంతితో ఇదే తొలి డే అండ్ నైట్ టెస్టు కావడం మరో విశేషం. -
అదో మంచి ప్రయోగం: కోహ్లి
నాగ్ పూర్:ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య నవంబర్ 27నుంచి అడిలైడ్ లో జరుగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్వాగతించాడు. టెస్టులను డే అండ్ నైట్ మ్యాచ్ లుగా నిర్వహిస్తే సాంప్రదాయ క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కోహ్లి.. డే అండ్ నైట్ టెస్టు నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ పెద్దలు తీసుకున్ననిర్ణయం నిజంగా అద్భుతమైనదిగా అభివర్ణించాడు. ఇది ఓ మంచి ప్రయోగంగా కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ఆ మ్యాచ్ ల కు వాడే పింక్ బాల్ పై కోహ్లి కాస్త అనుమానం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లు తెలిపిన సమాచరం మేరకు డే అండ్ నైట్ టెస్టులకు పింక్ బంతి సరైనది కాదని పేర్కొంటున్నట్లు కోహ్లి తెలిపాడు. అటు పగలు, ఇటు రాత్రి పింక్ బాల్ తో మ్యాచ్ నిర్వహణకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. సూర్యుడు అస్తమించే సమయంలో పింక్ బంతితో ఆడటం కష్టతరంగా మారే అవకాశం ఉందని కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
టెస్టు సిగలో ‘గులాబీ’
1971లో వర్షం వల్ల టెస్టులో నాలుగు రోజుల ఆట రద్దయ్యాక... చివరి రోజు ప్రయోగాత్మకంగా 40 ఓవర్ల మ్యాచ్ ఆడి ఉండకపోతే... క్రికెట్లో మరో ప్రత్యామ్నాయంగా వన్డేలు పుట్టేవా..? 1980లలో కెర్రీ ప్యాకర్ కొత్త తరహాలో ఆటను అందించి ప్రయోగం చేసినప్పుడు... ‘పైజామా క్రికెట్’ అని విమర్శలతో తిప్పి కొట్టడంతో సరిపెడితే... రంగుల దుస్తులు, డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఎంజాయ్ చేసేవాళ్లమా..? 2003లో ఆదరణ తగ్గుతున్న క్రికెట్‌కు కొత్త వినోదాన్ని పరిచయం చేయాలని ఇంగ్లండ్ తెచ్చిన టి20 ఫార్మాట్‌ను ‘గిమ్మిక్’గా కొట్టి పారేస్తే... ధనాధన్ బ్యాటింగ్ మెరుపులు, ఐపీఎల్ వైభవం చూసేవాళ్లమా..? కొత్త ఎప్పుడూ ‘చెత్త’ కాదు. ప్రయోగం విఫలం కావచ్చు... కానీ ప్రయత్నం చేయాల్సిందే. ప్రతిదీ విజయవంతం అవుతుందన్న గ్యారంటీ ఎక్కడా లేదు. గతంలో విమర్శలు వచ్చినా ముందుకు వెళ్లే సాహసం చేయడంతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కింది. ఇప్పుడు అదే కోవలో పింక్ బంతితో డే అండ్ నైట్ టెస్టులకు కూడా రంగం సిద్ధమైంది. దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేకపోయినా... ఆటకు సంబంధించి ఇది కూడా ఒక కీలక మలుపు కావడం ఖాయం. పింక్ బంతులతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 27నుంచి ఆసీస్, కివీస్ డే అండ్ నైట్ టెస్టుతో మొదలు పనితీరుపై భిన్నాభిప్రాయాలు సాక్షి కీడా విభాగం టెస్టు క్రికెట్ పుట్టి 138 ఏళ్లయింది. ఇప్పటికి 2188 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. మార్పు నిరంతర ప్రక్రియ కాబట్టి సహజంగానే ఇన్నేళ్లలో ఆటలో, నిబంధనల్లో పలు మార్పులు వచ్చాయి. అయితే వన్డేలు, టి20లతో పోలిస్తే చెప్పుకోదగ్గ విప్లవాత్మక తేడా టెస్టుల్లో కనిపించలేదు. తెల్ల దుస్తులు, ఎర్రబంతులతో దానిని అలాగే కొనసాగించాలనే సాంప్రదాయవాదుల ఆలోచన వల్ల టెస్టులు అదే మూసలో సాగుతున్నాయి. ఇప్పుడు టెస్టులకు కొత్త ‘ఫ్లేవర్’ జత చేరింది. తొలిసారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. వినూత్న ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే ఆస్ట్రేలియానే ఈ ఆలోచనకు ఊపిరి పోసింది. ఈ నెల 27 నుంచి కివీస్‌తో అడిలైడ్‌లో జరిగే మూడో టెస్టుతో ఇది మొదలవుతుంది. అన్నింటికి మించి ఈ మ్యాచ్‌లో మొదటిసారి గులాబీ బంతులను ఉపయోగిస్తుండటం పెద్ద విశేషం. ఇది ఎలా పని చేయబోతోంది అనేది ఆసక్తికరం. ప్రయోగం ఎక్కడ మొదలైంది? దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పింక్ బంతులను వాడారు. ఇది కొత్తగా అనిపించడంతో దీనిని టెస్టులకు ఎందుకు వాడకూడదనే ఆలోచన ఎంసీసీకి వచ్చింది. వైట్ డ్రెస్ సాంప్రదాయానికి భంగం కలగకుండా కొత్త బంతిని రూపొందించే బాధ్యతను 2009లో ఎంసీసీ అనుమతితో కూకాబుర్రా కంపెనీ తీసుకుంది. బరువు, సైజు విషయంలో అన్ని నిబంధనలనూ అనుసరిస్తూ ప్రస్తుతం గులాబీ బంతి ఉన్న తుది రూపుకు తీసుకొచ్చేందుకు గత ఐదేళ్లుగా వేర్వేరు దేశాల్లో దీనిని పరీక్షించారు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే, పాకిస్తాన్లలో వేర్వేరు మ్యాచ్‌లలో పింక్ బంతిని ఉపయోగించారు. భారత్, ఇంగ్లండ్‌లలో మాత్రం దీనిని ఇప్పటి వరకు వాడలేదు. ఎందుకు పింక్ బంతి? డే అండ్ క్రికెట్ ఆలోచన చాలా కాలంనుంచి ఉన్నా అది అమల్లోకి రాలేదు. లైట్ వేస్తే ఎర్ర బంతి సరిగా కనిపించదనే విషయం వెల్లడైంది. దాంతో ప్రత్యామ్నాయం చూస్తూ పసుపు, ఆకుపచ్చలాంటి అనేక రంగులను కూడా పరీక్షించారు. అయితే ఆటగాళ్ల వైట్డ్రెస్కు పూర్తి వ్యతిరేకంగా, కొట్టొచ్చినట్లు ఉండే రంగు ఉండాలని ప్రయోగాలు చేశారు. ఉదయంతో పాటు రాత్రి వేళల్లో కూడా ఇబ్బంది లేకుండా ఆడగల రంగు పింక్ మాత్రమే అని నిర్ధారించారు. టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఐసీసీ భావిస్తోంది. తేడా ఏమిటి? ఎర్రబంతితో పోలిస్తే మరీ చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదు. గులాబీ రంగుతో డైయింగ్ చేయడంతో పాటు గట్టితనం, బౌన్స్ విషయంలో అదే తరహాలో ఐదు పొరలతో దీనిని రూపొందించారు. బంతి మధ్యలోని సీమ్ ఆకుపచ్చని రంగుతో ఉంటుంది. అయితే మరింత ప్రకాశవంతంగా కనిపించేందుకు గులాబీ రంగుతో అదనంగా మరో కోటింగ్ చేశారు. ఈ కారణంగా ఆరంభంలోనే బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందని చెబుతున్నారు. మరో వైపు పింక్ బాల్ ఆకారం తొందరగా చెడిపోకుండా ఎక్కువ సమయం పాటు పనికొచ్చేలా ఉండేందుకు పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చిక ఉంచడం మంచిదని నిపుణుల విశ్లేషణ. దాంతో అడిలైడ్ టెస్టులో కూడా సాధారణంకంటే ఎక్కువ పచ్చిక ఉంచి పిచ్‌ను రూపొందిస్తున్నారు. స్పందన ఎలా ఉంది? ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిషెల్ స్టార్క్ పింక్ బాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎలా చూసినా ఇది ఎర్రబంతిలా స్పందించడం లేదు. స్వింగ్, గట్టిదనం విషయంలో పోలికే లేదు. చాలా తొందరగా మెత్తబడిపోతోంది. రివర్స్ స్వింగ్ కూడా కావడం లేదు. రాత్రి పూట బౌండరీనుంచి బంతి కనిపించడం లేదు’ అన్నాడు. అతనికి జాన్సన్, హాజల్‌వుడ్ కూడా మద్దతు పలకగా, వోజెస్ 28 ఓవర్లకే 68 ఓవర్ల బంతిలా కనిపిస్తోందని విమర్శించాడు. ఇక దిగ్గజం పాంటింగ్ అయితే సాంప్రదాయాన్ని దెబ్బ తీస్తున్నారంటూ మొదటి నుంచీ వ్యతిరేకత కనబర్చాడు. అయితే మరో దిగ్గజం స్టీవ్‌వా, న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం దీనిని ఆహ్వానించారు. టెస్టులపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటివి అవసరమని వా పేర్కొనగా... పింక్ బాల్ క్రికెట్ కూడా కొత్త సవాల్‌లాంటిదని, ఆటగాళ్లు దేనికైనా సిద్ధంగా ఉండాలని మెకల్లమ్ అన్నాడు. ఇక ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయోన్ అయితే ఇది స్పిన్నర్లకు అద్భుతంగా పనికొస్తుందని కితాబిచ్చాడు. బంతిపై ఉండే పచ్చ రంగు సీమ్ బ్యాట్స్‌మన్‌కు సరిగ్గా కనిపించదని, దాని వల్ల తమ గ్రిప్‌పై స్టైకర్ దృష్టి సరిగ్గా ఉండదని అతను అన్నాడు. అయితే ఆటగాళ్ల సందేహాలను క్రికెట్ ఆస్ట్రేలియా కొట్టి పారేసింది. అన్ని రకాల పరీక్షల తర్వాతే తాము టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైనట్లు వెల్లడించింది. ఎక్కడ ఉపయోగించారు? ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను పక్కన పెడితే ప్రొఫెషనల్ క్రికెట్లో ఈ ఏడాది ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో మూడు మ్యాచ్‌లు ఈ బంతితో డే అండ్ నైట్‌గా ఆడించారు. గత నెల 23న న్యూజిలాండ్, పీఎం ఎలెవన్ మధ్య కూడా వన్డే వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇటీవల పింక్ బంతితో బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని కూడా పరిశీలించి డీఆర్ఎస్కు కూడా ఇబ్బంది లేదని తేల్చారు. ‘మా పింక్ బంతి టెస్టు క్రికెట్‌కు సిద్ధంగా ఉంది’ అని కూకాబుర్రా ఎండీ బ్రెట్ ఇలియట్ ఘనంగా ప్రకటించారు. ‘అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ పరిస్థితులు, పిచ్‌లకు అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటారు. ఇంగ్లండ్ డ్యూక్ బంతి, భారత్‌లో అయితే ఎస్జీ బంతులతో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు పింక్ బంతి కూడా కొత్త తరహా ప్రయత్నంగా భావించాలి. కాబట్టి ఆటగాళ్లకు ఇది సమస్య కాకపోవచ్చు. ఇది సఫలం అవుతుందన్న నమ్మకం మాకుంది’ అని ఆయన విశ్వాసం ప్రకటించారు. ‘పింక్’ ప్రభావం: ఎప్పుడో ఏడాది క్రితం ఒకే ఒక టెస్టు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్‌ను ఆసీస్ జట్టు హడావిడిగా పిలిపించి అడిలైడ్ టెస్టు జట్టులో స్థానం కల్పించింది. అతను దేశవాళీలో పింక్ బంతితో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 18 వికెట్లు తీయడమే అందుకు కారణం. -
టెస్టులే క్రికెట్‌కు ఆధారం
లండన్: వన్డే, టి20 ఫార్మాట్ నుంచి సంప్రదాయక టెస్టు క్రికెట్‌ను కాపాడుకునేందుకు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పలు సూచనలు చేశాడు. దీంట్లో భాగంగా పింక్ కలర్ బంతులతో డే అండ్ నైట్ టెస్టులు ఆడించాలని చెప్పాడు. టి20, టెస్టులకు మధ్య ఫాస్ట్ ఫుడ్, రుచికరమైన భోజనానికి ఉన్న తేడా ఉందని అన్నాడు. ‘టెస్టు క్రికెట్ అనేది మహా వృక్షం లాంటిది. వన్డే అయినా టి20 అయినా వీటి కొమ్మలుగానే చెప్పుకోవచ్చు. అందరికీ చెట్టు ఫలాలు కనిపిస్తున్నా వాటిని మోస్తున్న చెట్టు సంగతి మరువరాదు. కొమ్మలకు కానీ ఫలాలకు కానీ ఇదే జీవన వనరు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టును నరికేస్తే ఇంకేమీ ఉండవు. అందుకే టెస్టులను మనం కాపాడుకోవాలి’ అని ద్రవిడ్ వివరించాడు. సుదీర్ఘ ఫార్మాట్ అనేది ఓ ఆటగాడి నైపుణ్యానికి పరీక్ష అని చెప్పాడు.