IND vs AUS 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆసీస్‌ | India Vs Australia Pink Ball 2nd Test Day 1 Match Live Score Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

IND vs AUS 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆసీస్‌

Published Fri, Dec 6 2024 8:55 AM | Last Updated on Fri, Dec 6 2024 5:19 PM

India vs Australia pink ball Test Day1: live updates and highlights

ముగిసిన తొలి రోజు ఆట.. పైచేయి సాధించిన ఆసీస్‌
భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (13) ఔట్‌ కాగా.. మెక్‌స్వీని (38), లబుషేన్‌ (20) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది.

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (6/48) టీమిండియాను దెబ్బేశాడు. కమిన్స్‌, బోలాండ్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

భారత ఇన్నింగ్స్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (42) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్‌ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31), అశ్విన్‌ (22), రిషబ్‌ పంత్‌ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్‌ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్‌, హర్షిత్‌ రాణా, బుమ్రా డకౌట్‌ అయ్యారు. కాగా, పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న మెక్‌స్వీని, లబుషేన్‌
మెక్‌స్వీని (38), లబుషేన్‌ (19) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. టీమిండియా పదేపదే బౌలర్లను మారుస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. 31 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 85/1గా ఉంది. 13 పరుగులు చేసి ఉస్మాన్‌ ఖ్వాజా ఔటయ్యాడు. ఈ వికెట్‌ బుమ్రాకు దక్కింది. ఆసీస్‌.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 95 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
24 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా భారత్‌కు తొలి బ్రేక్‌ అందించాడు. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఫస్ట్‌ స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ఉస్మాన్‌ ఖ్వాజా (13) పెవిలియన్‌ బాట పట్టాడు. మెక్‌స్వీనికి (6) జతగా లబూషేన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

180 పరుగులకు భారత్‌ ఆలౌట్‌
పింక్‌ బాల్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో మిచెల్‌ స్టార్క్‌ దాటికి భారత్‌ కేవలం 180 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ 6 వికెట్లతో టీమిండియాను దెబ్బతీశాడు.

అతడితో పాటు పాట్‌ కమ్మిన్స్‌, స్కాట్‌ బోలాండ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత బ్యాటర్లలో నితీశ్‌ రెడ్డి(42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

నితీశ్‌ ఫైటింగ్‌ నాక్‌
ఆసీస్‌ బౌలర్లపై టీమిండియా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఎదురుదాడికి దిగాడు. నితీశ్‌ మెరుపులు మెరిపిస్తున్నాడు. నితీశ్‌ 42 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 42 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 175/8

టీమిండియా ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఏడో వికెట్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌(22), ఎనిమిదో వికెట్‌గా హర్షిత్‌ రాణా(0) వెనుదిరిగాడు.

టీమిండియా ఆరో వికెట్‌ డౌన్‌.. 
టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌.. ప్యాట్‌ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 35 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్‌ రెడ్డి(11), అశ్విన్‌(1) పరుగులతో ఉన్నారు.

ఐదో వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ శర్మ ఔట్‌
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రోహిత్‌.. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 28 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌(10), నితీశ్‌ రెడ్డి(0) ఉన్నారు.

ట్రీ బేక్‌కు భారత్‌ స్కోరంతంటే?
అడిలైడ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆసీస్ పేసర్లు నిప్పలు చెరుగుతున్నారు. తొలి రోజు టీ విరామానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్‌(4), రోహిత్ శర్మ(1) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఇప్పటివరకు మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. బోలాండ్ ఒక్క వికెట్ సాధించారు.

టీమిండియా నాలుగో వికెట్‌ డౌన్‌.. 
టీమిండియా కేవలం 4 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. నాలుగో వికెట్‌గా శుబ్‌మన్‌ గిల్‌ వెనుదిరిగాడు. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు గిల్‌ దొరికిపోయాడు. క్రీజులోకి రోహిత్‌ శర్మ వచ్చాడు.

భారత్‌ మూడో వికెట్‌ డౌన్‌.. కోహ్లి ఔట్‌
పింక్‌బాల్‌ టెస్టులో విరాట్‌ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 21 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 81/3. క్రీజులో గిల్‌(31), రిషబ్‌ పంత్‌(4) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌..
కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రాహుల్‌.. స్టార్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.

15 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 53/1
కేఎల్‌ రాహుల్‌(26 నాటౌట్‌), శుబ్‌మన్‌ గిల్‌(25) నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌: 53/1

కేఎల్‌ రాహుల్‌ లక్కీ..
కేఎల్‌ రాహుల్‌కు ఆదృష్టం కలిసొచ్చింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు రాహుల్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అయితే అది నో బాల్‌ కావడంతో రాహుల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు తాకనట్లు తేలింది. 10 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 30/1

6 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 15/1
ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(14), కేఎల్‌ రాహుల్‌(0) ఉన్నారు. తొలి టెస్టుకు దూరమైన గిల్‌ పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం మంచి టచ్‌లో కన్పిస్తున్నాడు.

తొలి వికెట్‌ డౌన్‌..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తొలి బంతికే ఔటయ్యాడు. మిచిల్‌ స్టార్క్‌ ఎల్బీ రూపంలో జైశ్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు.

టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌..
బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య పింక్ బాల్ టెస్టు ఆడిలైడ్ వేదిక‌గా ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్  మూడు మార్పులతో బరిలోకి దిగింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చారు. వీరి ముగ్గురి రాకతో దేవ్‌దత్త్ పడిక్కల్‌, ధ్రువ్ జురెల్‌, వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒకే ఒక మార్పుతో ఆడుతోంది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ స్ధానంలో స్కాట్ బోలాండ్ ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), రోహిత్ శర్మ(కెప్టెన్‌), నితీష్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement