
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. కరుణరత్నే 174 బంతుల్లో 107 పరుగులు చేశాడు.
ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. .బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 92 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగలకే కుప్ప కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశాడు.
ఇక 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అయ్యర్ 67 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక ఈ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్అవార్డు దక్కగా, అయ్యర్ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.
చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్