Bengaluru Allows 100 Percent Crowd For Pink Ball Test: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు(డే అండ్ నైట్) పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) గురువారం ఓ ప్రకటన చేసింది. కోవిడ్ తర్వాత భారత్‌లో జరిగే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతించడం ఇదే తొలిసారి.
గతంలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వగా.. వైరస్ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో పింక్ బాల్ టెస్టుకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించాలని కేఎస్‌సీఏ కోరగా.. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. ఇక కోహ్లి వందో టెస్టు ఆడిన మొహలీలో 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు వంద శాతం అనుమతి ఇస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు సమాచారం.
కోహ్లి స్వస్థలం ఢిల్లీ అయినప్పటికి.. బెంగళూరు అతని హోమ్ గ్రౌండ్‌గా పరిగణిస్తారు. అందుకు కారణం ఐపీఎల్. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ వస్తున్నాడు. వాస్తవానికి కోహ్లి వందో టెస్టు ఇక్కడే ఆడించాలని ఫ్యాన్స్ కోరారు. కానీ బీసీసీఐ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పటికే తొలి టెస్టును గెలుచుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.
Getting Pink Ball Ready 😀😎#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/94O8DDzs9x
— BCCI (@BCCI) March 9, 2022
Comments
Please login to add a commentAdd a comment