
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అసలంకను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ సాధించాడు. తద్వారా అశ్విన్.. టీమిండియా దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్(434 వికెట్లు) రికార్డును బద్దలుకొట్టాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే 619 వికెట్లతో ఉండగా.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 417 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్ 9వ స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్( శ్రీలంక, 800 వికెట్లు), దివంగత మాజీ దిగ్గజం షేన్ వార్న్(708 వికెట్లు, ఆస్ట్రేలియా) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్, 640 వికెట్లు), అనిల్ కుంబ్లే( 619 వికెట్లు, టీమిండియా), గ్లెన్ మెక్‌గ్రాత్(563 వికెట్లు, ఆస్ట్రేలియా), స్టువర్ట్ బ్రాడ్( 537 వికెట్లు, ఇంగ్లండ్), కౌట్నీ వాల్ష్(వెస్టిండీస్, 519 వికెట్లు), డేల్ స్టెయిన్(439 వికెట్లు, దక్షిణాఫ్రికా) ఉన్నారు.. తాజాగా అశ్విన్(435 వికెట్లు, టీమిండియా) వీరి సరసన చేరాడు.
చదవండి: Jasprit Bumrah: వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్ సూపర్
Ravindra Jadeja: ఆ నిర్ణయం నాదే.. రోహిత్, ద్రవిడ్‌ల పాత్ర లేదు
🎥 🎥 That moment when @ashwinravi99 picked the landmark 4⃣3⃣5⃣th Test wicket 👏 👏 #TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/RKN3IguW8k
— BCCI (@BCCI) March 6, 2022