IND Vs SL: శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ రోహిత్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మొదటిది. కెప్టెన్‌గా తొలి టెస్టులో సక్సెస్ అయినప్పటికి.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 28 బంతుల్లో 29 పరుగులు చేసిన రోహిత్.. తన చివరి నాలుగు టెస్టుల్లో కనీసం అర్థసెంచరీ మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. తొలి టెస్టు మ్యాచ్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీలను తరలించిన రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు.
ఫుల్‌షాట్‌కు పెట్టింది పేరైన రోహిత్‌కు ఇప్పుడు అదే బలహీనంగా మారిందంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. మార్చి 12 నుంచి రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' రోహిత్ శర్మకు పుల్‌షాట్ అంటే చాలా ఇష్టం. తాను ఎప్పుడు బాదుడు మొదలుపెట్టిన అతని బ్యాటింగ్‌లో ఎక్కువ పుల్‌షాట్లే కనిపిస్తున్నాయి.
ఒక బ్యాట్స్‌మన్ అలవాటైన షాట్ ఆడుతున్నాడంటే బౌలర్లు అది పసిగట్టి దానిని బలహీనంగా మార్చే ప్రయత్నంలో ఉంటారు. పదేపదే అదే షాట్ ఆడడం మంచిది కాదు. ఇప్పుడు రోహిత్ పరిస్థితి కూడా అదే. పదే పదే పుల్ షాట్లకు పోవడం వల్ల రోహిత్ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు. తన చివరి నాలుగు టెస్టుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రతీసారి అతనికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అందుకే 80, 90, 100 పరుగులు సాధించే వరకు పుల్‌షాట్‌ను ఆడకపోవడం ఉత్తమం.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తొలి టెస్టులో 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. బెంగళూరు వేదికగా జరగనున్న పింక్‌బాల్ టెస్టు(డే అండ్ నైట్)లో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment