
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులు ఆడనున్నాయి. ఇందులో ఒకటి పింక్ బాల్ టెస్టుగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌కు ఇంకా బీసీసీఐ వేదికలను ఖారారు చేయలేదు.
ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అదే విధంగా రెండో టెస్టు ఢిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, ఆఖరి టెస్టుకు ఆహ్మదాబాద్ వేదికలుగా నిర్ణయించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
కాగా ఏడాది సెప్టెంబర్‌లో ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ ఆఖరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ముహార్తం ఫిక్స్! ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment