కోల్‌కతా: భారత్ జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ తడ‘బ్యాటు’కు గురైంది. బ్యాటింగ్‌కు ఆరంభించిన మొదలు స్వల్ప విరామాల్లో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటింగ్ ఆదిలోనే కకావికలమైంది. 12 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ నాలుగు వికెట్లలో ముగ్గురు డకౌట్లగా పెవిలియన్ చేరడం గమనార్హం. బంగ్లా కోల్పోయిన తొలి నాలుగు వికెట్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, షమీ, ఇషాంత్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్ ఇస్లామ్-ఇమ్రుల్ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్(4) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆపై కెప్టెన్ మోమినుల్ హక్, మహ్మద్ మిథున్, ముష్పికర్ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్ చేరారు. మోమినుల్, మిథున్‌లను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్ రెండు వికెట్లు తీయడం విశేషం.
మరోవైపు పింక్‌బాల్ టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. క్ బాల్‌తో మన దేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు పింక్ బాల్‌తో మొట్ట మొదటి టెస్ట్ ఆడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు షాద్‌మాన్ ఇస్లాం, ఇమ్రూల్ కేయాస్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి బంతిని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ వేయగా.. షాద్‌మాన్ ఆడాడు. భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ సంధించిన తొలి బౌలర్‌గా ఇషాంత్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment