అహ్మదాబాద్: పింక్ బాల్ టెస్టులో టీమిండియా అద్బుత విజయంతో పాటు పలు రికార్డులు బద్దలయ్యాయి. ఐదు రోజులు జరగాల్సిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. టెస్టు క్రికెట్ అత్యంత తక్కువ బాల్స్‌లోనే మ్యాచ్ ముగియడం చరిత్రలో ఏడోసారి మాత్రమే. తాజాగా పింక్ బాల్ టెస్టులో 842 బంతుల్లోనే ఫలితం వచ్చింది. కాగా ఈ ఏడులో ఆరు డే టెస్టులు కాగా.. ఇండియా, ఇంగ్లండ్ మాత్రమే డే నైట్ కావడం విశేషం. ఒకసారి ఆ వివరాలు పరిశీలిస్తే..
►1923లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా( మెల్‌బోర్న్.. 656 బంతులు) తొలి స్థానం
►1935లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్( బ్రిడ్జ్‌టౌన్.. 672 బంతులు) రెండో స్థానం
►1888లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా( మాంచెస్టర్.. 788 బంతులు) మూడో స్థానం
►1888లో ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా( మాంచెస్టర్.. 788 బంతులు) నాలుగో స్థానం
►1889లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్( కేప్‌టౌన్.. 796 బంతులు) ఐదో స్థానం
►1912లో ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా( ఓవల్.. 815 బంతులు) ఆరో స్థానం
►2021లో ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా(అహ్మదాబాద్.. 842 బంతుల) ఏడో స్థానం
చదవండి: స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్
Comments
Please login to add a commentAdd a comment