కోహ్లి షాట్‌కు బంగ్లా బౌలర్‌ క్లాప్స్‌ | Ind vs Ban: Kohli Applause From Bangladesh Bowler With Classic Cover Drive | Sakshi
Sakshi News home page

కోహ్లి షాట్‌కు బంగ్లా బౌలర్‌ క్లాప్స్‌

Published Sat, Nov 23 2019 2:27 PM | Last Updated on Sat, Nov 23 2019 2:43 PM

Ind vs Ban: Kohli Applause From Bangladesh Bowler With Classic Cover Drive - Sakshi

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆట కోసం వేల సంఖ్యలో అభిమానులు స్టేడియాలకు వస్తుంటారనేది కాదనలేదని వాస్తవం. కొడితే సెంచరీ కొట్టాలి అన్నట్లు కోహ్లి ఆట సాగడమే ఫ్యాన్స్‌ను స్టేడియాలకు రప్పించాలే చేస్తోంది. కోహ్లి ఆటకు ప్రత్యర్థి ఆటగాళ్లు ఫిదా అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కోహ్లి షాట్‌ కొట్టినప్పుడు ప్రత్యేకంగా ఆ షాట్‌కు ప్రత్యర్థి బౌలర్‌ ముగ్థుడు కావడం చాలా అరుదనే చెప్పాలి.

కాగా, బంగ్లాదేశ్‌ పేసర్‌ ఎబాదత్‌ హుస్సేన్‌ తన బౌలింగ్‌లో కోహ్లి షాట్‌ ఆడగా దానికి క్లాప్స్‌ కొట్టకుండా ఉండలేకపోయాడు. శుక్రవారం తొలి రోజు ఆటలో రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లు పెవిలియన్‌ చేరిన తర్వాత, పుజారాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఆ క‍్రమంలోనే తన ఫేవరెట్‌ షాట్‌ కవర్‌ డ్రైవ్‌ను కోహ్లి కొట్టగా, బౌలర్‌ ఎబాదత్‌ క్లాప్స్‌ కొట్టి అభినందించాడు. ఎబాదత్‌ ఆఫ్‌ స్టంప్‌పై వేసిన ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను కోహ్లి కవర్స్‌ మీదుగా ఫోర్‌కు పంపడం చూసి ఎబాదత్‌ మైమరచిపోయాడు. కోహ్లిని క్లాప్స్‌తో అభినందించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement