సెంచరీ సాధించిన టామ్ బ్లండెల్
New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ 306 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (77)కు తోడు.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్(138) సెంచరీతో రాణించడంతో ఈ మేరకు స్కోరు చేసింది. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 306 పరుగుల(82.5 ఓవర్లలో) వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ 3 వికెట్లు తీయగా.. రాబిన్సన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వాళ్లలో స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, కెప్టెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది. కాగా గత కొంతకాలంగా దూకుడైన ఆటతో టెస్టు క్రికెట్‌కు కొత్త పాఠాలు చెబుతున్న ఇంగ్లండ్ మరోసారి అదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది.
వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా..
న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 58.2 ఓవర్లు మాత్రమే ఆడిన ఆ జట్టు ఏకంగా ఓవర్‌కు 5.57 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.
వికెట్లు కోల్పోయే అవకాశం ఉన్నా... ఓపిగ్గా క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేయకుండా ఇంగ్లండ్ బ్యాటర్లంతా ధాటిని కొనసాగించారు. హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 89; 15 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (68 బంతుల్లో 84; 14 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, ఒలి పోప్ (42), బెన్ ఫోక్స్ (38) రాణించారు.
కాన్వే, బ్లండెల్ వల్లే..
నీల్ వాగ్నర్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 37 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో కాన్వే, బ్లండెల్ బ్యాట్ ఝులిపించడంతో ఆతిథ్య కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేయగలిగింది.
మరోసారి అదే దూకుడు
ఈ క్రమంలో 19 పరుగుల ఆధిక్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. స్వల్ప ఆధిక్యమే అయినా ఇంగ్లండ్ దూకుడుకు మాత్రం కళ్లెం పడలేదు. 9 ఓవర్లలోనే 50 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలే 27 (29), బెన్ డకెట్23 (25) దూకుడు ప్రదర్శిస్తున్నారు.
అయితే, 9.2 వద్ద టిక్నర్ డకెట్‌ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్ మౌంగనీయ్, వెల్టింగ్టన్ ఈ సిరీస్‌కు వేదికలుగా మారాయి.
చదవండి: Anderson- Stuart Broad: ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ సంచలనం.. 1000 వికెట్లతో..
IND Vs AUS: పాపం వార్నర్.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్
Tom Blundell (138) leads the batting effort with his highest Test score. Blundell and Tickner share a 59-run partnership for the 10th wicket, pushing the total 306. Time to bowl at Bay Oval! Follow play LIVE in NZ with @sparknzsport & @todayfm_nz 📲 #NZvENG pic.twitter.com/QO4XENUfSt
— BLACKCAPS (@BLACKCAPS) February 17, 2023
Comments
Please login to add a commentAdd a comment