New Zealand vs England, 1st Test: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల జంట జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్‌లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది.
గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెగ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. పేసర్ మెగ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్‌లలో కలిసి ఆడి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు.
కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో ఆండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్‌లో బ్రాడ్ నైట్ వాచ్‌మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో జేమ్స్ ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్‌లో చేరింది.
ఇక ఆండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల ఆండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
చదవండి: Ind Vs Aus- BCCI: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా?!
నటాషా నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment