
పాక్‌తో కివీస్ తొలి టెస్టు (PC: Blackcaps Twitter)
Pakistan vs New Zealand, 1st Test: టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌సషిప్ 2021-23 సీజన్‌లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం(డిసెంబరు 26) ఆరంభమైన తొలి మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు నమోదైంది.
టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌతీ.. బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో బంతిని అజాజ్ పటేల్ చేతికి ఇవ్వగా.. స్పిన్‌తో తిప్పేశాడు. ఈ బాల్‌ను అంచనా వేయడంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7) విఫలం కాగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండల్ అతడిని స్టంపౌట్ చేశాడు.
145 ఏళ్ల చరిత్రలో తొలిసారి
ఇక ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లోనూ వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్(3)ను ఇదే రీతిలో బ్లండల్ స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు నమోదైంది. 145 ఏళ్ల పురుషుల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా తొలి రెండు వికెట్లు స్టంపౌట్ ద్వారా లభించడం ఇదే మొదటిసారి కాగా.. ఓవరాల్‌గా రెండోసారి.
గతంలో..
1976లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జమైకాలో జరిగిన టెస్టులో తొలిసారి ఈ ఫీట్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ మారీ కార్నిష్ నాలుగు వికెట్లు(టూయీస్ బ్రౌనీ, జాస్మిన్ సామీ, గ్లోరియా గిల్) తీయగా.. అందులో మూడు స్టంపౌట్లే ఉండటం విశేషం.
చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్
Mohammad Rizwan: వైస్ కెప్టెన్‌పై వేటు! 4 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలి మ్యాచ్.. ఆఫ్రిదిపై విమర్శలు
Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు