కళ్లుచెదిరే క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే(వీడియో) | Santner Pulls Off Catch Of The Hundred 2024 | Sakshi
Sakshi News home page

The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే(వీడియో)

Published Wed, Aug 14 2024 9:30 AM | Last Updated on Wed, Aug 14 2024 11:05 AM

Santner Pulls Off Catch Of The Hundred 2024

ది హాండ్ర‌డ్ లీగ్‌-20224లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ మిచెల్ సాంట్న‌ర్ త‌న ఫీల్డింగ్ విన్యాసాల‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సాంట్న‌ర్ మ‌రోసారి సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు.

మంగ‌ళ‌వారం(ఆగ‌స్టు 13) లండన్ స్పిరిట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న‌మ్మ‌శ‌క్యం కాని క్యాచ్‌ను ఈ కివీ స్టార్ అందుకున్నాడు. సూప‌ర్ క్యాచ్‌తో లండ‌న్ స్పిరిట్ బ్యాట‌ర్ మైఖేల్ పెప్పర్‌ను సాంట్న‌ర్ పెవిలియ‌న్‌కు పంపాడు.

లండ‌న్ ఇన్నింగ్స్ 11వ బంతిని పేస‌ర్ రీస్ టాప్లీ.. పెప్ప‌ర్‌కు ఫుల్ అండ్ మిడిల్‌లో సంధించాడు. పెప్ప‌ర్ ఆ బంతిని మిడ్ ఆన్ మీద‌గా భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు.

కానీ షాట్ స‌రిగ్గా క‌నక్ట్ కాక‌పోవ‌డంతో  బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఈ క్రమంలో మిడాన్‌లో ఉన్న సాంట్నర్ వెనక్కి పరిగెత్తుతూ అద్భుతమైన బ్యాక్‌వర్డ్ రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. 

చివరి క్షణం వరకు బంతిపై తన దృష్టిని కోల్పోకుండా వెనక్కి వెళ్లిన సాంట్నర్‌.. డైవ్ సంచలన క్యాచ్‌ను తీసుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లండ‌న్ స్పిరిట్‌పై నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఘన విజయం సాధించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement