నవంబర్ 9 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో మిచెల్ సాంట్నర్ కివీస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న మొదటి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లలో సాంట్నర్ న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మిచ్ హే తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జాక్ ఫోల్క్స్ పేసర్లుగా.. ఐష్ సోధి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా.. గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా.. మార్క్ చాప్‌మన్, హెన్రీ నికోల్స్, టిమ్ రాబిన్సన్, జోష్ క్లార్క్‌సన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.
ఈ సిరీస్‌ల కోసం టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియమ్ ఓరూర్కీ, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్‌లను పరిగణలోకి తీసుకోలేదు. వీరంతా ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు. భారత్‌తో సిరీస్ ముగిసిన అనంతరం వీరు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
కాగా, రెండు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. నవంబర్ 9న డంబుల్లా వేదికగా తొలి టీ20, నవంబర్ 10న అదే డంబుల్లా వేదికగా రెండో టీ20 జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 13న డంబుల్లా వేదికగానే తొలి వన్డే, నవంబర్ 17, 19 తేదీల్లో క్యాండీ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్‌కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్, ఐష్ సోధి, విల్ యంగ్
చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు గాయం
Comments
Please login to add a commentAdd a comment