
బెన్ లిస్టర్ (PC: Blackcaps Twitter)
India Vs New Zealand T20 Series 2023: టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. భారత్‌తో తలపడే జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దేశీ లీగ్‌లలో సత్తా చాటిన హెన్రీ షీప్లే, బెన్ లిస్టర్ తొలిసారి జట్టుకు ఎంపికయ్యారు.
భారత పర్యటనకు
కాగా జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించనుంది. వన్డే సిరీస్‌తో ఇండియా టూర్ మొదలు పెట్టి టీ20 సిరీస్‌తో ముగించనుంది. ఈ నేపథ్యంలో బ్లాక్‌కాప్స్ టీ20 జట్టును ప్రకటించడం విశేషం. ఇక డిసెంబరులోనే వన్డే జట్టు వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. జనవరి 27న రాంచి వేదికగా టీమిండియా- కివీస్ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్ సిరీస్ మొదలు కానుంది. జనవరి 29, ఫిబ్రవరి 1న మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే కివీస్ జట్టు ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ డ్రా కాగా.. వన్డే సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.
టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్పీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ రిప్పన్, హెన్రీ షీప్లే, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.
చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
Zim Vs IRE: చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో