రాంచీ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టి20 మొదలైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఊహించినట్లుగానే పృథ్వీ షాకు తుది జట్టులో చోటు దక్కలేదు. చహల్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు. లంకతో ఆడిన జట్టే కివీస్‌తో తొలి టి20లో బరిలోకి దిగింది. ఇక న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్ స్థానంలో మార్క్ చాప్‌మన్, ఇష్ సోదీ జట్టులోకి వచ్చారు.
భారత్ : హార్దిక్ పాండ్యా(కెప్టెన్),ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్(కెప్టెన్),ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్
► అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం. దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు.
► వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్‌ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా సాన్‌ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు.తాజా వన్డే సిరీస్‌లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది.అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది.
చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment