మిచెల్‌ సాంట్నర్‌ సూపర్‌ సిక్స్‌.. అద్దాలు పగిలిపోయాయి | Mitchell Santner Six Smashes New Zealand Cricket Museum Window Viral | Sakshi
Sakshi News home page

Mitchell Santner: మిచెల్‌ సాంట్నర్‌ సూపర్‌ సిక్స్‌.. అద్దాలు పగిలిపోయాయి

Published Wed, Jan 26 2022 10:45 AM | Last Updated on Wed, Jan 26 2022 1:54 PM

Mitchell Santner Six Smashes New Zealand Cricket Museum Window Viral - Sakshi

Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్‌ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్‌ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మిచెల్‌ సాంట్నర్‌ సూపర్‌ సిక్స్‌ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్‌ స్మాష్‌ లీగ్‌లో భాగంగా బేసిన్‌ రిజర్వ్‌ పార్క్‌లో వెల్లింగ్టన్‌, నార్త్రన్‌ నైట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.

చదవండి: క్వార్టర్‌ ఫైనల్స్‌కే ఇంత రచ్చ.. మరి కప్‌ గెలిస్తే!

మ్యాచ్‌లో సాంట్నర్‌ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో  59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్‌ కొట్టిన ఒక సిక్స్‌ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్‌ నైట్స్‌ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెల్లింగ్టన్‌ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్‌ అలెన్‌ 64, కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్త్రన్‌ నైట్స్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 

చదవండి: రాహుల్‌, పంత్‌కు ప్రమోషన్‌.. రహానే, పుజారాలకు డిమోషన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement