cricket ground
-
బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్
సాక్షి, అమరావతి: మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. కాస్త తీరిక.. కొద్దిగా ఖాళీ ప్రదేశం దొరికితే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెటర్లు అయిపోతుంటారు. బ్యాట్, బాల్‌తో తమ ప్రతాపం చూపిస్తుంటారు. కానీ మారుతున్న పరిస్థితుల్లో నగరాల్లో ఖాళీ స్థలాలు కనుమరుగైపోయి క్రికెట్ ఆడుకోవడానికి కొద్దిపాటి స్థలం కూడా లేకుండా పోతోంది. ఈ సమస్యకు పరిష్కారంలా ‘బాక్స్ క్రికెట్’ (box cricket) పుట్టుకొచ్చింది. వయసుతో పాటు ఆడ, మగ అనే సంబంధం లేకుండా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాస్త సమయం దొరికితే.. వెంటనే ‘బాక్స్ క్రికెట్’లో వాలిపోతున్నారు. ఆదరణ పెరుగుతుండటంతో రాష్ట్రంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి.బిజినెస్ రూపంలో కూడా ‘బాక్స్ క్రికెట్’ విజయవంతంగా కొనసాగుతోందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. 300 గజాలకు పైగా స్థలం ఉంటే చాలు.. ఇళ్ల మధ్యలో అయినా బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేయొచ్చు. సొంత స్థలం ఉంటే మరీ మంచిది. ఆ స్థలం ఇనుప కడ్డీలు పాతి బాక్స్ మాదిరిగా ఫ్రేమ్ సెట్ చేయాలి. బాల్ బయటకు పోకుండా చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు చేయాలి. కిందపడినప్పుడు దెబ్బలు తగలకుండా.. నేలపై గ్రాస్ కార్పెట్ పరచాలి. రాత్రి సమయంలో కూడా క్రికెట్ ఆడుకునే విధంగా ఫ్లడ్‌లైట్ల సదుపాయం కల్పించాలి. రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. గల్లీ క్రికెట్ మాదిరే..బాక్స్ క్రికెట్లో బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించవచ్చు.. బాల్‌ను గింగిరాలు తిప్పవచ్చు. అలాగే చుట్టూ నెట్ ఉండటం వల్ల బాల్ కోసం ఎక్కువ దూరం పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. బాక్స్ క్రికెట్ రూల్స్ అన్నీ.. గల్లీ క్రికెట్ మాదిరిగానే ఉంటాయి. బాల్ నేరుగా నెట్‌కు తగిలితే సిక్స్.. స్టెప్లు పడుతూ వెళ్లి నెట్‌కు తగిలితే ఫోర్.. సింగిల్స్, డబుల్స్, రనౌట్లు.. అన్నీ సేమ్ టూ సేమ్. ఊరికి కాస్త దూరంగా ఉంటే తక్కువ చార్జీ, నగరం మధ్యలో ఉంటే కాస్త ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నారు. గంట సమయం ఆడుకోవాలంటే సుమారు రూ.600 నుంచి రూ.1,000 వరకు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.బ్యాట్, బాల్, వికెట్లు నిర్వాహకులే అందజేస్తారు. ఎండ దెబ్బ కూడా తగలకుండా పైన గ్రీన్ మ్యాట్‌ను వేస్తున్నారు. మంచినీరు, కూల్‌డ్రింక్స్, కేఫ్ వంటి వసతులు అందుబాటులో ఉంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11 గంటల వరకు ఆడుకునే అవకాశం ఉండటంతో అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ తీరిక సమయాల్లో బాక్స్ క్రికెట్ ఆడుతూ సేదతీరుతున్నారు. అలాగే ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలనుకునేవారికి శిక్షణ ఇచ్చేందుకు కూడా కొన్ని బాక్స్ క్రికెట్ క్లబ్‌ల వద్ద కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.ఎవరైనా ఆడుకోవచ్చుబాక్స్ క్రికెట్‌కు ఏ వయసు వారైనా రావచ్చు. పెద్ద వారు చాలా మంది వస్తున్నారు. సరదాగా ఆడుకుని వెళుతుంటారు. అలాగే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదగాలనుకునే 20 ఏళ్లలోపు వారికి శిక్షణ కూడా ఇస్తుంటాం. ముంబై నుంచి వచ్చిన కోచ్‌తో పాటు మొత్తం ముగ్గురు కోచ్‌లు ఉన్నారు. ఆడపిల్లలు కూడా క్రికెట్ ఆడటానికి వస్తున్నారు. – గుత్తుల ఫణీంద్రబాబు, మేనేజర్, భారత్ బెస్ట్ స్పోర్ట్స్ క్లబ్, విజయవాడసెల్ఫోన్కు దూరం..మా ఇద్దరు పిల్లల్ని రోజూ రెండు గంటల పాటు బాక్స్ క్రికెట్ ఆడుకోవడానికి పంపిస్తున్నాను. మా పెద్దబాబు బరువు కూడా తగ్గి ఆరోగ్యంగా ఉన్నాడు. అలాగే సెల్‌ఫోన్ అలవాటుకు కూడా దూరమవుతున్నారు. – అరవింద్, ఆటోనగర్ఇష్టంతో వస్తున్నా..నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కొన్ని నెలలుగా బాక్స్ క్రికెట్ ఆడుతున్నాను. – తులసీ మాధవ్, మాచవరం -
పర్సు పక్కన పెట్టి క్రికెట్.. రూ. 6.72 లక్షలు గోవిందా!
ముంబై: పర్సు పక్కన పెట్టిన క్రికెట్ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు. ఎలా జరిగిందంటే.. ముంబై క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన బాధితుడు వివేక్ దవే క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్న వ్యాలెట్, మొబైల్ ఫోన్ సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగించుకుని బోరివలికి రైలులో ఇంటికి వెళుతుండగా తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ లావాదేవీ సందేశాలను గమనించాడు. వాటి ప్రకారం అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలు కట్ అయ్యింది. దుండగులు అతని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 5 లక్షలకు పైగా కొనుగోళ్లు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, బాధితుడు మూడు గంటల పాటు క్రికెట్ ఆడుతుండగా, గుర్తు తెలియని నిందితులు అతని క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించారు, ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదును విత్‌డ్రా చేశారు. నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్ చేశారు. దీంతో బాధితుడు ఆ నగల దుకాణాలను సంప్రదించగా వారు సీసీ ఫుటీజ్ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పరస్పరం దాడికి దిగిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
-
గల్వాన్ లోయలో క్రికెట్ ఆడిన భారత జవాన్లు..
న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది. పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం. -
ఇంగ్లండ్‌లో క్రికెట్ గ్రౌండ్‌కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌లోని లీస్టర్‌షైర్ క్రికెట్ గ్రౌండ్‌కు 'గవాస్కర్ గ్రౌండ్'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్‌కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. సునీల్ గావస్కర్ తొలి ఆటగాడిగా ఈ అరుదైన ఘనత సాధించి చరిత్రలో నిలిచాడు. ఇటీవలే లీస్టర్‌షైర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని గవాస్కర్ సొంతం చేసుకున్నాడు. క్రికెట్లో గావస్కర్ చేసిన సేవలకు గానూ లీస్టర్‌షైర్ క్రికెట్ అసోసియేషన్ తమ గ్రౌండ్‌కు 'గావస్కర్ గ్రౌండ్' అని పేరు పెట్టినట్లు తెలిపింది. తన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల మీద గావస్కర్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నాడు. ఇప్పటికే లీస్టర్‌షైర్ గ్రౌండ్‌లోని ఒక పెవిలియన్ ఎండ్ గోడపై సునీల్ గావస్కర్ పెయింటింగ్ పెద్ద ఎత్తున గీశారు. సన్నీ యువ క్రికెటర్‌గా చేతిలోని బ్యాట్ భుజంపై పెట్టుకొని ఫోజు ఇచ్చిన ఫోటోను పెయింటింగ్‌గా వేశారు. కాగా గావస్కర్ పేరిట తాంజానియా, అమెరికాల్లోనూ తన పేరిట క్రికెట్ గ్రౌండ్లు ఉన్నాయి. లీస్టర్‌షైర్ గ్రౌండ్‌కు తనపేరు పెట్టడంపై 73 ఏళ్ల దిగ్గజ క్రికెటర్ స్పందించాడు. ''లీస్టర్‌షైర్ సిటీలో క్రికెట్ వాతావరణం ఎక్కువగా ఉంఉటంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా ఇండియన్ మూలాలున్న క్రికెటర్లు ఎక్కువగా ఉంటారు. అందుకే గ్రౌండ్‌కు నా పేరు పెట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ దిగ్గజం.. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెస్టుల్లో టీమిండియా తరపున 10వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టుల్లో 34 సెంచరీలు సాధించి అత్యధిక సెంచరీలు అందుకున్న ఆటగాడిగా(సచిన్ బ్రేక్ చేసేవరకు) నిలిచాడు. ఇక టెస్టుల్లో బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆల్‌టైమ్ జాబితాలో చోటు సంపాదించాడు. 1971-1987 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గావస్కర్ లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. సునీల్ గావస్కర్ టీమిండియా తరుపున 108 వన్డేల్లో 3092 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 125 టెస్టు మ్యాచ్‌ల్లో 10,122 పరుగులు చేసిన గావస్కర్ ఖాతాలో 34 సెంచరీలు, 45 అర్థసెంచరీలు ఉన్నాయి. Leicester cricket ground to be named after Sunil Gavaskar, he became the first Indian cricketer to have a ground named after him in England. (Source - TOI) — Johns. (@CricCrazyJohns) July 22, 2022 Leicester cricket ground to be named after Sunil Gavaskar - Sunil Gavaskar's giant image has already been painted on one entire wall of the pavilion. pic.twitter.com/MWUKKjBa8O — CricketMAN2 (@ImTanujSingh) July 22, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. విండీస్ గడ్డ మీద కోహ్లి డబుల్ సెంచరీ! అరుదైన రికార్డు.. -
మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి
Mitchell Santner Smashes Museum Window Hitting Big Six.. న్యూజిలాండ్‌లో క్రికెట్ మైదానాలు ఎంత చిన్నగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్యాట్స్‌మన్ భారీ సిక్స్‌లు కొడితే బంతులన్నీ స్డేడియం బయటే ఉంటాయి. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్ దెబ్బకు స్టేడియంలోని మ్యూజియం అద్దాలు పగిలిపోయాయి. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా బేసిన్ రిజర్వ్ పార్క్‌లో వెల్లింగ్టన్, నార్త్రన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: క్వార్టర్ ఫైనల్స్కే ఇంత రచ్చ.. మరి కప్ గెలిస్తే! మ్యాచ్‌లో సాంట్నర్ 35 బంతుల్లో ఆరు సిక్సర్లు.. నాలుగు ఫోర్లతో 59 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా సాంట్నర్ కొట్టిన ఒక సిక్స్ స్డేడియంలోని మ్యూజియం అద్దాలను పగలగొట్టింది. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన బంతిని అంపైర్లు బయటికి తీయలేకపోయారు.. కారణం మ్యూజియానికి తాళం ఉండడమేనట. దీంతో కొత్త బంతి తీసుకొని ఆటను కొనసాంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో నార్త్రన్ నైట్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఫిన్ అలెన్ 64, కెప్టెన్ బ్రేస్‌వెల్ 63 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్రన్ నైట్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! "The ball is stuck in there, next time they go to open it they will find a white Kookaburra in there" 😂 Mitch Santner finds a window in the Museum Stand.#SparkSport #SuperSmashNZ@cricketwgtninc @SuperSmashNZ pic.twitter.com/9e8j5XMdcB — Spark Sport (@sparknzsport) January 24, 2022 -
మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లో టెంట్ వేసుకొని నిద్రపోయాడు
లండన్: ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ అభిమాని జార్వో చేసిన పని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆట మూడోరోజు లంచ్ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా జార్వో భారత జెర్సీ ధరించి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఈ సమయంలో..'' భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే జార్వోకు ఇది కొత్త కాదట.. ఇంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటివి చాలా చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా జార్వో చేసిన మరోపని తాజాగా వెలుగుచూసింది. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్ చేసి మైదానంలోకి వచ్చాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక లార్డ్స్ టెస్టులో 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్ టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్ వచ్చింది. కాగా ఆగస్టు 25 నుంచి లీడ్స్ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది. చదవండి: నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్చల్ -
'మాకోసం ఆ మైదానాలు చిన్నగా మార్చండి'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం దిశగా సాగిన చెన్నై ఒక్కసారిగా తడబడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ధోని, కేదార్ జాదవ్ ఆటతీరును చాలా మంది విమర్శించారు. అయితే చెన్నై తాను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు చేజింగ్‌కే పరిమితమైంది. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి : పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ వరుణ్) ఈ నేపథ్యంలో సీఎస్కే మేనేజ్మెంట్ శుక్రవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఉన్న బౌండరీలైన్‌ను తగ్గించాలంటూ కౌన్సిల్‌ను కోరినట్లు తెలిసింది. మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడం.. పైగా దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్ ఆటగాళ్లు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని సీఎస్కే తెలిపింది. అంతేగాక మా జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో చేజింగ్ చేయాల్సి రావడం.. మొదట ఫీల్డింగ్‌లో అలిసిపోవడంతో మా ఆటగాళ్లు చేదనలో ఎనర్జీతో కనిపించడం లేదన్నారు. అందుకే తాము ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసి దుబాయ్, అబుదాబి మైదానాల్లోని బౌండరీ లైన్‌ను తగ్గించాలని కోరినట్లు తెలిపారు. చెన్నై జట్టు చేసిన ప్రతిపాదనను రాజస్తాన్ జట్టు కూడా స్పందిస్తూ ఈ విషయంలో తమ మద్దతు కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం.(చదవండి : ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా) వాస్తవం : చెన్నై యాజమాన్యం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లుగా వచ్చిన వార్తలో నిజం లేదు. ఇది కేవలం ఉహాగానాలు మాత్రమే. -
క్రికెట్ కోసం ఫుట్‌బాల్ స్టేడియాన్ని నాశనం చేస్తారా!
తిరువనంతపురం: నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ను కొచ్చి నగరానికి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు ఫుట్‌బాలర్లు, అభిమానులు కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికే కేసీఏ తిరువనంతపురంలో అత్యున్నత ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. గత నవంబర్‌లో భారత్, కివీస్ మధ్య మూడో టి20 కొత్త స్టేడియంలో జరిగింది. కానీ ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు కాకుండా కొచ్చిలోని నెహ్రూ స్టేడియం (మల్టీపర్పస్)లో నిర్వహించేందుకు కేసీఏ సిద్ధమవుతుంది. ఇక్కడ గతేడాది అండర్–17 ప్రపంచకప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. దీని కోసం స్టేడియంను ‘ఫిఫా’ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటే మైదానంలో తవ్వకాలు, పెనుమార్పులు తప్పవు. సచిన్ కూడా... ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు యజమాని అయిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా దీనిపై స్పందించాడు. ‘ఫిఫా గుర్తింపు పొందిన కొచ్చి స్టేడియానికి జరగబోయే నష్టం గురించి ఆందోళనగా ఉంది. అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్ రెండింటికీ సమస్య రాకుండా వ్యవహరించాలని కేరళ క్రికెట్ సంఘాన్ని కోరుతున్నా. రెండు ఆటల అభిమానులు నిరాశ పడరాదు. దీనిపై వినోద్‌రాయ్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు’ అని సచిన్ ట్వీట్ చేశాడు. -
రంజీ మ్యాచ్‌లు రావా..?
12 ఎకరాల్లో కడప నగరంలో ఏర్పాటైన పచ్చటి క్రికెట్ మైదానం ఇక కేవలం చిన్న చిన్న మ్యాచ్‌లకే పరిమితమా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.. కడప కంటే వెనుక ఏర్పాటైన మైదానాలకు సైతం రంజీ మ్యాచ్‌లు కేటాయిస్తుంటే అన్ని విధాలుగా సౌకర్యాలు కలిగి ఉండటంతో పాటు గతంలో మూడు రంజీ మ్యాచ్‌లు నిర్వహించిన అనుభవం ఉన్న కడపకు ఈ సీజన్లో ఎటువంటి స్టేట్మ్యాచ్లు ఇవ్వకపోవడంతో పాటు గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రంజీ మ్యాచ్ కూడా కేటాయించకపోవడం చూస్తుంటే కడప మైదానం పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ఉన్న అభిమానం ఏపాటిదో ఇట్టే అర్థమైపోతోంది. జిల్లా క్రికెట్ సంఘం పాత్ర పరిమితమేనా..! జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా దాదాపు 25 సంవత్సరాలుపైగా ఎం. వెంకటశివారెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్‌లో సైతం గట్టి పట్టు ఉండటంతో రెండుసార్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవిలో సైతం కొనసాగుతున్నారు. ఈయనతో పాటు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన డి. నాగేశ్వరరాజు సౌత్‌జోన్ కార్యదర్శిగా, సౌత్‌జోన్ కార్యదర్శిగా పనిచేసిన ఉమామహేశ్వర్‌రావుకు ఏసీఏ ఎస్టేట్ మేనేజర్‌గా ఏసీఏలో కీలకమైన సభ్యులుగా ఉన్నారు. వీరు తలచుకుంటే ఏసీఏలో చక్రం తిప్పి జిల్లాకు రంజీలు వచ్చేలా చేయగల శక్తి ఉన్నవారే. అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మ్యాచ్‌లు రాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఏపీఎల్పైనా నీలి నీడలు..? ఈ ఏడాది డిసెంబర్–జనవరి మధ్య కాలంలో కడప నగరంతో పాటు మరో మూడు మైదానాల్లో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహించేలా ఏసీఏ నిర్ణయించింది. పోటీల్లో పాల్గొనేందుకు 6 క్రీడాజట్లను సైతం వివిధ పేర్లతో ఖరారు చేసింది. దీంతో రంజీలు రాకపోయినా మంచి మ్యాచ్‌లు చూసే అవకాశం లభించిందనుకున్న జిల్లా క్రీడాకారుల ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. కడప స్పోర్ట్స్ : నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం ఏర్పాటైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది. 2011 డిసెంబర్ 6 నుంచి 9 వరకు తొలి రంజీ మ్యాచ్ ఆంధ్రా–విదర్భ జట్ల మధ్య సాగింది. 2012 డిసెంబర్ 29 నుంచి 2013 జనవరి 1వ తేదీ వరకు ఆంధ్రా–కేరళ జట్ల మధ్య రెండో రంజీ నిర్వహించారు. తర్వాత 2013 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు మూడో రంజీ మ్యాచ్ ఆంధ్రా–మహారాష్ట్ర జట్ల మధ్య సాగింది. అప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కడపలోని మైదానానికి రంజీ మ్యాచ్‌లను కేటాయించకపోవడం గమనార్హం. అభిమానుల ఆశలు ఆవిరి.. పెద్దపెద్ద నగరాలకు వెళ్లి క్రికెట్ చూడలేని క్రీడాభిమానులకు కడప నగరంలో చక్కటి మైదానం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లలో సైతం అంతర్జాతీయ క్రికెటర్లు కడప గడపలో అడుగిడిన వేళ క్రీడాకారుల ఆనందం చెప్పలేనిది. కడప నగరంలోని మైదానానికి అంతర్జాతీయ ఆటగాళ్లు సాయిరాజ్బహుతులే, హేమాంగ్ బదాని, అమొల్ మజుందార్, సంజు శ్యాంసన్, శివసుందర్దాస్, వేణుగోపాల్, శ్రీశాంత్ తదితర ఆటగాళ్లతో పాటు ప్రస్తుత భారతజట్టు ఆటగాడు కేదార్‌జాదవ్ వంటి ఆటగాళ్లను నేరుగా తిలకించే అవకాశం జిల్లా వాసులకు లభించింది. అటువంటిది మూడు సంవత్సరాలు అవుతున్నా మళ్లీ రంజీ మ్యాచ్‌ల ఊసే లేకపోవడం క్రీడాభిమానులకు తీరినిలోటే. వైఫల్యం ఎక్కడ..? కడప మైదానంలో నిర్వహించిన మూడు రంజీ మ్యాచ్‌లు సైతం ఫలితం తేలక డ్రాగా ముగిశాయి. దీంతో పిచ్ పట్ల బీసీసీఐ బృందం అసంతృప్తి వ్యక్తం చేసి.. పిచ్‌లను ఆధునీకరించాలని సూచించింది. ఇటీవలే మైదానానికి దాదాపు రూ.10 లక్షల వెచ్చించి మంచి వికెట్‌ను సైతం తీర్చిదిద్దారు. జిల్లాలో కేవలం అంతర్ జిల్లాల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారే తప్ప కనీసం రాష్ట్రస్థాయి మ్యాచ్‌లను కూడా ఈ యేడాది కేటాయించక పోవడం క్రీడాభిమానులకు మింగుడుపడని అంశం. రంజీ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రయత్నం చేస్తాం.. ఈ ఏడాది అన్ని విభాగాల్లో అంతర్ జిల్లాల పోటీలు కడపకు కేటాయించారు. రంజీ మ్యాచ్‌ల కంటే ఎంతో ఆసక్తికరంగా ఉండే ఏపీఎల్ నిర్వహించేందుకు మా ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో కడపకు ఏపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారు. అయితే మ్యాచ్‌లపై కాస్త స్తబ్ధత ఉంది. రాష్ట్రంలో ఏపీఎల్ ప్రారంభమైతే కడపలో ఖచ్చితంగా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. వచ్చే యేడాది క్రికెట్ సీజన్లో రంజీ మ్యాచ్‌లను కడపలో నిర్వహించేందుకు ఏసీఏ సహకారంతో కృషిచేస్తాం. – ఎం. వెంకటశివారెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు -
బ్యాటంత ఎత్తు లేడు..బ్యాట్ పట్టాడు
-
కూల్ కెప్టెన్ ధోనీ
విశ్లేషణం పని విషయంలో ధోనీ ప్రొయాక్టివ్‌గా ఉంటాడు. సమస్యలనుంచి తప్పించుకునే ధోరణి చూపకుండా... సానుకూల దక్పథంతో లక్ష్యంవైపు అడుగులు వేస్తాడు. మైదానంలో ఆడేటప్పుడైనా, మైక్ ముందు మాట్లాడేటప్పుడైనా ధోనీ నింపాదిగా ఉంటాడు. ఏం మాట్లాడాలన్నా ఓసారి ఎడమవైపు కిందికి చూసి, ఆ తర్వాత తల పెకైత్తి... ‘యూ నో...’ అంటూ మాట్లాడటం మొదలుపెడతాడు. ఆ మాటల్లోనూ యాక్టివిటీ, ఫీలింగ్స్‌కు సంబంధించిన పదాలే ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేప్పుడు కుర్చీలో కుదురుగా కూర్చోకుండా కదులుతూ ఉంటాడు. వీటన్నింటిని బట్టి ధోనీది ప్రాథమికంగా అనుభూతి ప్రధాన (కైనస్థటిక్) వ్యక్తిత్వమని చెప్పవచ్చు. ఆటగాళ్లలో ఈ వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వారికి తమ శరీరం, కదలికలపై ఎక్కువ అవగాహన, పట్టు ఉంటాయి. అందుకే బంతిని ఎలా కొట్టాలో, ఎంత బలంగా కొడితే ఎక్కడ పడుతుందో ధోనీకి బాగా తెలుసు. ‘ఈ క్షణమే’ విజయ రహస్యం గతంలో జీవించేవారు చేసిన తప్పుల గురించి బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తులో జీవించేవారు ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానంలో జీవించేవారు చేసేపని చక్కగా చేయడంపైనే దష్టి పెడతారు. ధోనీ వర్తమానంలోనే జీవిస్తాడు. చేసిన తప్పుల విశ్లేషణలో కాలం గడపకుండా... అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేక్రమంలో ఆందోళన చెందకుండా... ఆ రోజు తాను ఆడాల్సిన ఆటపైనే, ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలో తాను ఎదుర్కొనబోయే బంతిపైనే దృష్టి పెడతాడు. ‘ఈ క్షణంలో జీవించడమే నాకిష్టం’, ‘నేనే పని చేస్తున్నా, బెస్ట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని చెప్తాడు... జీవిస్తాడు... అలాగే ఆడతాడు కూడా. అదే అతని విజయరహస్యం. పరిమితుల నుంచి అపరిమితంగా... అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడమే జీవన గమనాన్ని, విజయాలను నిర్దేశిస్తుందన్న ధోనీ ఫిలాసఫీ కూడా అతడి మాటల్లో కనిపిస్తుంది. తనకు మాత్రమే స్వంతమైన హెలికాప్టర్షాట్ అలా పుట్టిందే. తాను క్రికెట్ నేర్చుకునే రోజుల్లో టెన్నిస్బాల్ను బౌండరీలైన్‌ను దాటించడం కోసం బలంగా బాదడంలో భాగంగా ఆ షాట్ నేర్చుకున్నానని ధోనీ చెప్తాడు. పరిమిత వనరులను బలంగా మార్చుకునే లక్షణం అతనికి చిన్నప్పుడే అలవడిందనడానికి ఈ షాటే నిదర్శనం. ధోనీ తన జీవితాన్ని ఆనందిస్తాడు. తాను సాధించిన విజయాలపట్ల గర్విస్తాడు. మరింత మెరుగైన విజయాలకోసం తనవైన రూల్స్ నిర్దేశించుకుంటాడు. ఈ లక్షణాలే అతన్ని విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా నిలిపాయి. జస్ట్ కెప్టెన్... 20-20, వన్డే, టెస్ట్‌లలో భారత జట్టును నెంబర్‌వన్‌గా నిలిపిన ధోనీ సక్సెస్ఫుల్ కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏ ఆటగాడిలో ఏ నైపుణ్యం ఉంటుందో అతను ఇట్టే పసిగట్టేస్తాడు. సరైన సమయంలో బరిలోకి దించుతాడు. పూర్తి సామర్థ్యంతో ఆడేలా వారిని ఉత్తేజపరుస్తాడు. విజయం సాధిస్తాడు. అయితే జట్టు సభ్యులతో అతనికి వ్యక్తిగత సంబంధాలు తక్కువ, స్నేహం అంతంత మాత్రమే. ధోనీ వారిని జట్టు సభ్యులుగానే చూస్తాడు తప్ప, తనవారిగా చూడడు. కావాలంటే అతని మాటలను గమనించండి. ది ప్లేయర్, ది టీమ్ అంటాడే తప్ప.. మై ప్లేయర్, మై టీమ్ అనడు. అందుకేనేమో అతనికి క్రికెటర్లలో స్నేహితులు తక్కువ. ‘పత్రికలు, టీవీలు మేం గెలిస్తే ఆకాశానికెత్తుతాయి, ఓడిపోతే విరుచుకుపడతాయి. అందుకే నేను పత్రికలు, టీవీలు పెద్దగా చదవను, చూడను. కానీ నేను గెలిచినా, ఓడినా నా పెంపుడు కుక్కలు నన్ను అంతే ప్రేమతో పలకరిస్తాయి, అంతే ఆనందంగా ఆడుకుంటాయి. అందుకే వాటితోనే రిలాక్స్ అవుతాను’ అని చెప్పడం ధోనీకి మాత్రమే ప్రత్యేకం! - విశేష్, సైకాలజిస్ట్ -
క్రికెట్ గ్రౌండ్లో సిల్లీబ్రాండ్