విరాట్ కోహ్లి- రోహిత్ శర్మ
India Tour OF West Indies 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి జట్టులో చోటు దక్కలేదు. వీరికి విశ్రాంతినిచ్చారా లేదంటే వచ్చే ప్రపంచకప్-2024 నాటికి యువ జట్టును తయారు చేసుకునే క్రమంలో పక్కకు పెట్టారా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్‌లోనే టీమిండియా ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
నాటి నుంచి రోహిత్, కోహ్లి దాదాపు టీ20 సిరీస్‌లన్నింటికి దూరంగానే ఉన్నారు. అదే సమయంలో ప్రతి సిరీస్‌కు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాడు. తాజాగా విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు.
రోహిత్, కోహ్లి శకం ముగియనుందా?
అజిత్ అగార్కర్ టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా నియమితుడైన తర్వాత ఎంపిక చేసిన తొలి జట్టులో యువకులకే పెద్దపీట వేశారు. దీంతో పొట్టి ఫార్మాట్లో రోహిత్, కోహ్లి శకం ముగియనుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాళ్లు ఎవరైతే ఏంటి?
‘‘అత్తుత్తమంగా ఆడే వాళ్లు ఎవరైనా సరే వారిని జట్టులోకి తీసుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు టీ20 ఫార్మాట్లో మరి కొన్నేళ్లు కొనసాగగలరు. మరి సెలక్టర్లు వాళ్లను ఎందుకు పక్కకు పెడుతున్నారో అర్థం కావడం లేదు.
ఐపీఎల్‌లో కోహ్లి అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. రోహిత్ కూడా మెరుగ్గా రాణించగలడు. వాళ్లిద్దరు టీ20 క్రికెట్‌లో మరిన్ని అద్భుతాలు చేయగలరు. ఆ సత్తా వారికుంది’’ అని రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పుకొచ్చాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ, 34 ఏళ్ల కోహ్లిని భారత టీ20 జట్టులో కొనసాగించాలని విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్-2023లో కోహ్లి అద్బుత ప్రదర్శన
కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 14 ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీల సాయంతో 639 పరుగులు సాధించాడు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం 16 ఇన్నింగ్స్‌లో 332 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్- టీమిండియా మధ్య టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి. టెస్టు, వన్డేలు ముగిసిన తర్వాత కోహ్లి, రోహిత్ స్వదేశానికి పయనం కానున్నారు.
వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
చదవండి: నువ్వేం తండ్రివి? యువీ చితకబాదినపుడు ఎక్కడున్నావు? నీ స్థాయి మరచి..
సినిమాను తలపించే ట్విస్టులు! కుటుంబాల మధ్య గొడవ.. సీక్రెట్‌గా ప్రేమా, పెళ్లి! ఆఖరికి
Comments
Please login to add a commentAdd a comment