మెరిసిన తిలక్.. గెలిచిన ‘బ్రదర్స్’ | Thilak sucessful...Brothers cricket academy won | Sakshi
Sakshi News home page

మెరిసిన తిలక్.. గెలిచిన ‘బ్రదర్స్’

Published Fri, May 2 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Thilak sucessful...Brothers cricket academy won

అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: తిలక్ వర్మ (42 బంతుల్లో 72 నాటౌట్), సానా కార్తీక్ (35 బంతుల్లో 57)లు చెలరేగడంతో బ్రదర్స్ క్రికెట్ అకాడమీ (బీసీఏ) 9 వికెట్ల తేడాతో అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ (ఏఏసీఏ)పై గెలుపొందింది. అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీలో భాగంగా శుక్రవారం బేగంపేట గ్రౌండ్స్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏఏసీఏ 25 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శివ (40), రహీం (31)లు రాణించారు. అనంతరం బీసీఏ జట్టు 13.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది.
 
 ఇతరమ్యాచ్‌ల ఫలితాలు:  రాజు సీసీ (జూబ్లీ హిల్స్):  58 ఆలౌట్ (సుకేష్ 4/18, అంకిత్ 4/16); ఖాజా సీఏ: 60/0 (సాయిరాజ్ 34 నాటౌట్)  గుజరాత్ సీఏ: 114 (అభిలాష్ 44; విజయ్‌కుమార్ 3/25); సెయింట్ పీటర్స్ సీఏ: 115/2 (గణేశ్ 30, వికాస్‌రావు 37 నాటౌట్)  రాజు సీసీ (మాదాపూర్): 82 (సాయికుమార్ 2/19); సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్: 83 (అజయ్‌దేవ్ గౌడ్ 35 నాటౌట్, కృష్ణ 37 నాటౌట్).  ఎస్‌కెఎన్ సీఏ: 106/7 (భరద్వాజ్ 27; ఆరిఫ్ అహ్మద్ 2/5); హెచ్‌పీఎస్ (బి): 107/7 (రాజశేఖర్ 50).   స్పోర్ట్స్ సెంటర్: 202/7 (ప్రతీక్ 73, రోహిత్ 3/25); ఎవర్‌గ్రీన్ సీఏ: 140/7 (మధు 38; సహేంద్ర 3/10).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement