under-16
-
Grandmaster status: భారత 76వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్ ఆనంద్
ఈ ఏడాది భారత్ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–16 విభాగంలో టైటిల్ సాధించిన ప్రణవ్ 2500 ఎలో రేటింగ్ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ చెస్ ఫెస్టివల్లో ప్రణవ్ మూడో జీఎం నార్మ్ సాధించాడు. ఈ సంవత్సరం భరత్ సుబ్రమణియమ్ (తమిళనాడు), రాహుల్ శ్రీవత్సవ్ (తెలంగాణ), ప్రణవ్ వెంకటేశ్ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు. -
వయసు దాటినవారు 51 మంది...
తిరుపతి: క్రీడల్లో తప్పుడు వయోధ్రువీకరణ పత్రాలతో తక్కువ వయసు స్థాయి పోటీల్లో పాల్గొనడటం తరచుగా జరుగుతూనే ఉంది. ఇలాంటిదే ఇటీవల జరిగిన ఒక ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తిరుపతి వేదికగా నవంబర్ 24 నుంచి 26 మధ్య వరకు జరిగిన జాతీయ జూనియర్ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ మీట్లో ఇది చోటు చేసుకుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో పోటీ పడటానికి దేశవ్యాప్తంగా 494 జిల్లాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు ఈ మీట్లో పాల్గొన్నారు. అయితే వీరి వయసును తెలుసుకోవడానికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వారికి వయసు నిర్ధారిత పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగా అథ్లెట్లకు దంత పరీక్షలు, టానర్ వైట్‌హౌస్ (టీడబ్ల్యూ3– ఎక్స్‌రే ద్వారా ఎముక వయసును కనుగొనే పద్ధతి) పరీక్షలు నిర్వహించగా... అందులో 51 మందికి ఎక్కువ వయసు ఉన్నట్లు తేలింది. వీరంతా తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో పోటీల్లో పాల్గొంటున్నట్లు ఏఎఫ్ఐ కనిపెట్టింది. మరో 169 మంది పరీక్షల్లో పాల్గొనకుండా ముందే తప్పించుకున్నట్లు ఏఎఫ్ఐ వయసు నిర్ధారిత పరీక్షల నిర్వహణాధికారి రాజీవ్ ఖత్రి తెలిపారు. దీనిపై ఆయా రాష్ట్రా ల వివరణను కోరనున్నట్లు ఏఎఫ్ఐ స్పష్టం చేసింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వేదికగా జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్ లో కూడా దాదాపు 100 మంది ప్లేయర్లు తప్పుడు వయసుతో పోటీల్లో పాల్గొంటూ పట్టుబడ్డారు. -
కీర్తన సంచలనం
ముంబై: అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ అండర్–16 స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కీర్తన పాండియన్ విజేతగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కీర్తన ఫైనల్లో 3–1 (53–44, 16–49, 62–42, 72–39) ఫ్రేమ్‌ల తేడాతో అల్బీనా లెస్‌చుక్ (బెలారస్)పై గెలిచింది. అంతకుముందు నాకౌట్ మ్యాచ్‌ల్లో కీర్తన 3–0తో మనస్విని (భారత్)పై, 3–0తో అలీనా ఖైరూలినా (రష్యా)లపై గెలిచి సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఆమె 3–1తో డిఫెండింగ్ చాంపియన్ అనుపమ (భారత్)పై నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. -
జిల్లాలో ప్రతిభావంతులకు కొదువ లేదు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువ లేదని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో అండర్–16 సౌత్ ఇండియా టోర్నీ విజేతగా నిలిచిన ఆర్డీటీ క్రికెట్ జట్టు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియా స్థాయిలో విజేతగా నిలవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు షాబుద్దీన్, తాహీర్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు
ఏలూరు రూరల్: జిల్లా బాలికలు క్రికెట్ పోటీల్లో అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లగా అండర్–16, 19 విభాగాల్లో విజయకేతనం ఎగురవేయగా తాజాగా అండర్–16 జిల్లా బాలికల జట్టు సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. ఈనెల 3 నుంచి 9 వరకు గుంటూరులో జరిగిన అంతర్ జిల్లాల్లో క్రికెట్ పోటీల్లో జిల్లాజట్టు సత్తాచాటింది. పోటీల్లో ప్రతిభ చాటిన ఈ.తేజస్వి, యు.సంధ్య, ఎస్.మంజుల, వి.స్రవంతి సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు. బాలికలకు శిక్షణ ఇచ్చిన కోచ్ ఎస్.రమాదేవి, పీఈటీ ప్రవీణతో పాటు క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు వి.విద్యాప్రసాద్, ఎం.వగేష్‌కుమార్, వీఎస్ మంగేష్ ఎండీఎఫ్ రెహమాన్ అభినందించారు. -
21న అండర్–16 క్రికెట్ టోర్నమెంట్
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 21న వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో అండర్–16 సిటీ స్కూల్స్ స్థాయి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఆదివారం మాత్రమే నిర్వహించే టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినరోజు సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలతో, స్కూల్ లెటర్‌ప్యాడ్‌పై రాసి ఈ నెల 18లోపు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. క్రీడాకారులు తెల్లని యూనిఫాం ధరించి, పూర్తి కిట్‌తో హాజరుకావాలని తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 98495 70979 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
ఈసీడీజీకి అండర్-16 టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర అండర్-16 ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఈసీడీజీ జట్టు విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఈసీడీజీ 2 వికెట్ల తేడాతో దినేశ్‌వర్మ క్రికెట్ అకాడమీపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దినేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. హర్ష్ (25), శివమ్ (23) రాణించగా, నిఖిల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈసీడీజీ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. సునిధిదాస్ 30 పరుగులు చేశాడు. అండర్-19లో ఈసీడీజీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ టీమ్ 35 పరుగులతో ఈసీడీజీపై గెలుపొందింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేయగా...హైదరాబాద్ ఈసీడీజీ 19.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ఒబేద్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్ష్‌కు 3 వికెట్లు దక్కాయి. -
మూడో రౌండ్లో సామ సాత్విక
జాతీయ టెన్నిస్ టోర్నీ ముంబై: రమేశ్ దేశాయ్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు సత్తా చాటారు. అండర్-16 బాలికల విభాగంలో ఎనిమిదో సీడ్ సామ సాత్విక మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సాత్విక, శివాని ఆమినేని చెరో సెట్ గెలిచారు. అయితే మూడో సెట్లో సాత్విక 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో శివాని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సాత్విక తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది. ఇదే విభాగంలో రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు హర్ష సాయి చల్లా 3-6, 1-6తో ఆకాంక్ష భాన్ (గుజరాత్) చేతిలో, సాయి దేదీప్య 1-6, 3-6తో రిషిక రవి (తమిళనాడు) చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక బాలుర అండర్-16 విభాగంలో శ్రీవత్స రాచకొండ 2-6, 2-6తో రియాన్ పండోల్ (మహారాష్ట్ర) చేతిలో, రోహన్ కె.రెడ్డి 0-6, 0-6తో మూడో సీడ్ సనిల్ జగ్తియాని (బెంగాల్) చేతిలో ఓటమి పాలయ్యారు. బాలికల అండర్-12 విభాగంలో ఏపీకి చెందిన క్రీడాకారిణిలు రెండో సీడ్ అంజుమ్ షేక్ 6-1, 6-0తో పూర్వి భట్‌పై, నాలుగో సీడ్ ఫాతిమా జువేరియా 6-4, 6-4తో వన్షిక చౌదరి (యూపీ)పై, ఆరో సీడ్ రచనా రెడ్డి 6-2, 6-4తో శ్రేయ కుడుమల (ఏపీ)పై, ధృతి కపూర్ 6-2, 6-2తో అస్మిత కౌర్ (హర్యానా)పై, ముష్రాత్ అంజుమ్ షేక్ 6-2, 6-0తో ఆయూషి సింగ్ (బీహార్)పై విజయం సాధించారు. -
మెరిసిన తిలక్.. గెలిచిన ‘బ్రదర్స్’
అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీ సాక్షి, హైదరాబాద్: తిలక్ వర్మ (42 బంతుల్లో 72 నాటౌట్), సానా కార్తీక్ (35 బంతుల్లో 57)లు చెలరేగడంతో బ్రదర్స్ క్రికెట్ అకాడమీ (బీసీఏ) 9 వికెట్ల తేడాతో అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ (ఏఏసీఏ)పై గెలుపొందింది. అండర్-16 అంతర్ అకాడమీల టోర్నీలో భాగంగా శుక్రవారం బేగంపేట గ్రౌండ్స్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏఏసీఏ 25 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. శివ (40), రహీం (31)లు రాణించారు. అనంతరం బీసీఏ జట్టు 13.2 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. ఇతరమ్యాచ్ల ఫలితాలు: రాజు సీసీ (జూబ్లీ హిల్స్): 58 ఆలౌట్ (సుకేష్ 4/18, అంకిత్ 4/16); ఖాజా సీఏ: 60/0 (సాయిరాజ్ 34 నాటౌట్) గుజరాత్ సీఏ: 114 (అభిలాష్ 44; విజయ్‌కుమార్ 3/25); సెయింట్ పీటర్స్ సీఏ: 115/2 (గణేశ్ 30, వికాస్‌రావు 37 నాటౌట్) రాజు సీసీ (మాదాపూర్): 82 (సాయికుమార్ 2/19); సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్: 83 (అజయ్‌దేవ్ గౌడ్ 35 నాటౌట్, కృష్ణ 37 నాటౌట్). ఎస్కెఎన్ సీఏ: 106/7 (భరద్వాజ్ 27; ఆరిఫ్ అహ్మద్ 2/5); హెచ్‌పీఎస్ (బి): 107/7 (రాజశేఖర్ 50). స్పోర్ట్స్ సెంటర్: 202/7 (ప్రతీక్ 73, రోహిత్ 3/25); ఎవర్గ్రీన్ సీఏ: 140/7 (మధు 38; సహేంద్ర 3/10). -
సాయి దేదీప్య జోడికి టైటిల్
సింగిల్స్‌లో ఫైనల్‌కు ఎస్‌ఎమ్‌టీఏ అండర్-16 టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: సనాలి-ఎస్‌ఎమ్‌టీఏ అండర్-16 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో నగరానికి చెందిన సాయి దేదీప్య సత్తాచాటింది. బాలికల అండర్-16 డబుల్స్‌లో శివానితో కలిసి ట్రోఫీ నెగ్గిన ఆమె సింగిల్స్ టైటిల్‌పై కన్నేసింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో గురువారం జరిగిన డబుల్స్ ఫైనల్లో దేదీప్య-శివాని ద్వయం 4-6, 7-5, 10-4తో ధరణ ముదలియార్-కృతిక చాబ్రా జోడిపై గెలిచింది. సింగిల్స్ సెమీస్‌లో సాయి దేదీప్య 4-1తో లతికపై ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి తప్పుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. మరో మ్యాచ్‌లో షేక్ హుమేరా 6-7 (0/7), 7-6 (8/6), 6-4తో హర్షసాయి చల్లాపై గెలిచింది. ఫైనల్లో హుమేరాతో దేదీప్య తలపడుతుంది. బాలుర సెమీస్‌లో ఇషాక్ ఇక్బాల్ 6-0, 6-0తో శ్రీవత్స రాతకొండపై, ఉత్కర్ష్ భరద్వాజ్ 3-6, 6-3, 6-0తో విక్రమ్ ధనుంజయ్‌పై నెగ్గారు. బాలుర డబుల్స్ ఫైనల్లో ఇషాక్ ఇక్బాల్-క్రిస్టియాన్ కమ్మింగ్స్ జోడి 6-4, 6-4తో ప్రలోక్-రిత్విక్ చౌదరి జంటపై గెలిచింది. -
నేటి నుంచి కోకాకోలా కప్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: కోకాకోలా కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థతో కలిసి ఈ అండర్-16 టోర్నీని నిర్వహిస్తుంది. ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. ఒక్కో పూల్ నుంచి తొలి స్థానంలో నిలిచిన నాలుగు జట్లు 26 నుంచి జరిగే సెమీఫైనల్ పోటీలకు అర్హత పొందుతాయి. అనంతరం 28న టైటిల్ పోరు జరుగుతుంది. నగరంలోని భవాన్స్ రామకృష్ణ కాలేజి, కాల్ పబ్లిక్‌స్కూల్, ఇండస్ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి), హెచ్‌పీఎస్ రామంతాపూర్, బేగంపేట్, గురుకుల్ విద్యాపీఠ్ (ఇబ్రహీంపట్నం) తదితర ప్లే గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 50 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 35 వేలు నగదు బహుమతి అందజేస్తారు. తొలి రోజు జరిగే మ్యాచ్‌ల్లో భేగాస్ హైస్కూల్‌తో జాన్సన్ గ్రామర్ స్కూల్; పల్లవి మోడల్ స్కూల్‌తో ఇండస్ వరల్డ్ స్కూల్; మెహబూబ్ కాలేజి హైస్కూల్ జట్టుతో నాసర్ స్కూల్, సెయింట్ జోసఫ్ స్కూల్‌తో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి తలపడతాయి. -
నేటి నుంచి కోకాకోలా కప్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: కోకాకోలా కప్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమవుతుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ), కోకాకోలా సంస్థతో కలిసి ఈ అండర్-16 టోర్నీని నిర్వహిస్తుంది. ఈనెల 28 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. ఒక్కో పూల్ నుంచి తొలి స్థానంలో నిలిచిన నాలుగు జట్లు 26 నుంచి జరిగే సెమీఫైనల్ పోటీలకు అర్హత పొందుతాయి. అనంతరం 28న టైటిల్ పోరు జరుగుతుంది. నగరంలోని భవాన్స్ రామకృష్ణ కాలేజి, కాల్ పబ్లిక్‌స్కూల్, ఇండస్ పబ్లిక్ స్కూల్ (సైనిక్‌పురి), హెచ్‌పీఎస్ రామంతాపూర్, బేగంపేట్, గురుకుల్ విద్యాపీఠ్ (ఇబ్రహీంపట్నం) తదితర ప్లే గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 50 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 35 వేలు నగదు బహుమతి అందజేస్తారు. తొలి రోజు జరిగే మ్యాచ్‌ల్లో భేగాస్ హైస్కూల్‌తో జాన్సన్ గ్రామర్ స్కూల్; పల్లవి మోడల్ స్కూల్‌తో ఇండస్ వరల్డ్ స్కూల్; మెహబూబ్ కాలేజి హైస్కూల్ జట్టుతో నాసర్ స్కూల్, సెయింట్ జోసఫ్ స్కూల్‌తో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి తలపడతాయి.