సాయి దేదీప్య జోడికి టైటిల్ | sai dedeepya team won title | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్య జోడికి టైటిల్

Published Thu, May 1 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

sai dedeepya team won title

 సింగిల్స్‌లో ఫైనల్‌కు
 ఎస్‌ఎమ్‌టీఏ అండర్-16 టెన్నిస్
 
 సాక్షి, హైదరాబాద్: సనాలి-ఎస్‌ఎమ్‌టీఏ అండర్-16 సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన సాయి దేదీప్య సత్తాచాటింది. బాలికల అండర్-16 డబుల్స్‌లో శివానితో కలిసి ట్రోఫీ నెగ్గిన ఆమె సింగిల్స్ టైటిల్‌పై కన్నేసింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో గురువారం జరిగిన డబుల్స్ ఫైనల్లో దేదీప్య-శివాని ద్వయం 4-6, 7-5, 10-4తో ధరణ ముదలియార్-కృతిక చాబ్రా జోడిపై గెలిచింది.

సింగిల్స్ సెమీస్‌లో సాయి దేదీప్య 4-1తో లతికపై ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి తప్పుకోవడంతో ఆమెను విజేతగా ప్రకటించారు. మరో మ్యాచ్‌లో షేక్ హుమేరా 6-7 (0/7), 7-6 (8/6), 6-4తో హర్షసాయి చల్లాపై గెలిచింది. ఫైనల్లో హుమేరాతో దేదీప్య తలపడుతుంది. బాలుర సెమీస్‌లో ఇషాక్ ఇక్బాల్ 6-0, 6-0తో శ్రీవత్స రాతకొండపై, ఉత్కర్ష్ భరద్వాజ్ 3-6, 6-3, 6-0తో విక్రమ్ ధనుంజయ్‌పై నెగ్గారు. బాలుర డబుల్స్ ఫైనల్లో ఇషాక్ ఇక్బాల్-క్రిస్టియాన్ కమ్మింగ్స్ జోడి 6-4, 6-4తో ప్రలోక్-రిత్విక్ చౌదరి జంటపై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement