ఈసీడీజీకి అండర్-16 టైటిల్ | ECDG got under-16 title | Sakshi
Sakshi News home page

ఈసీడీజీకి అండర్-16 టైటిల్

Published Sun, Oct 5 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

ఈసీడీజీకి అండర్-16 టైటిల్

ఈసీడీజీకి అండర్-16 టైటిల్

సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర అండర్-16 ఎమర్జింగ్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఈసీడీజీ జట్టు విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఈసీడీజీ 2 వికెట్ల తేడాతో దినేశ్‌వర్మ క్రికెట్ అకాడమీపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దినేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. హర్ష్ (25), శివమ్ (23) రాణించగా, నిఖిల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈసీడీజీ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. సునిధిదాస్ 30 పరుగులు చేశాడు.  అండర్-19లో ఈసీడీజీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ టీమ్ 35 పరుగులతో ఈసీడీజీపై గెలుపొందింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులు చేయగా...హైదరాబాద్ ఈసీడీజీ 19.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. ఒబేద్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హర్ష్‌కు 3 వికెట్లు దక్కాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement