21న అండర్–16 క్రికెట్ టోర్నమెంట్
Published Wed, Aug 10 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 21న వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో అండర్–16 సిటీ స్కూల్స్ స్థాయి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఆదివారం మాత్రమే నిర్వహించే టోర్నమెంటులో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినరోజు సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలతో, స్కూల్ లెటర్‌ప్యాడ్‌పై రాసి ఈ నెల 18లోపు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. క్రీడాకారులు తెల్లని యూనిఫాం ధరించి, పూర్తి కిట్‌తో హాజరుకావాలని తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 98495 70979 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement