క్రికెట్ టోర్నీ ప్రారంభం
క్రికెట్ టోర్నీ ప్రారంభం
Published Mon, Feb 20 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో ఆదివారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారక ఉద్యోగుల క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. మొత్తం 22 జట్లు పాల్గొంటున్నాయి. తొలిరోజు ఎనిమిది జట్లు తలపడ్డాయి. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు పగడాల మల్లికార్జున, కార్యదర్శి బీఆర్ ప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పోటీలు ప్రతి ఆదివారం అనంత క్రీడా మైదానం, నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షులు జొన్నా జయప్రకాష్, ఆర్డీటీ ఏడీ నాగప్ప, సభ్యులు మధుసూదన్ ఆచారి, అలీ పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
= గుంతకల్లు రైల్వేస్, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుంతకల్లు రైల్వేస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేశారు. జట్టులో శ్రీకాంత్‌రెడ్డి 61, శివ 54 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. జట్టులో జగన్ 48 పరుగులు సాధించాడు.
= రెండవ మ్యాచ్ ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఏపీ ట్రాన్స్ కో జట్టు 174 పరుగులు చేసింది. జట్టులో రమణ 66 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇరిగేషన్ జట్టు 145 పరుగులు చేసింది. జట్టులో కిషోర్ 55 పరుగులు సాధించాడు.
= మూడవ మ్యాచ్‌లో ఎలక్ట్రిక్, రిలయన్స్ జట్లు తలపడ్డాయి. చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రిక్ జట్టు 132 పరుగులు సాధించింది. జట్టులో దినేష్ 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిలయన్స్ జట్టు 129 పరుగులు చేసింది. జట్టులో యోగి 35 పరుగులు సాధించాడు.
= చివరి మ్యాచ్ టీచర్స్, సాంఘిక సంక్షేమ శాఖ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీచర్స్ జట్టు 165 పరుగులు చేసింది. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ జట్టు 65 పరుగులకే కుప్పకూలింది.
Advertisement
Advertisement