ప్లేయర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
క్రికెట్ పోటీలు ప్రారంభం
Aug 8 2016 8:20 PM | Updated on Sep 4 2017 8:25 AM
గుంటూరు స్పోర్ట్స్: ప్లేయర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు క్రీడాకారులను పరిచయం చేసుకోని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, పోటీలలో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించటం కీలకమన్నారు. ఉదయం జరిగిన మ్యాచ్‌లో నాగేశ్వరరావు లెవెన్ జట్టు 34 పరుగుల తేడాతో మనోజ్ లెవెన్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన నాగేశ్వరరావు జట్టు 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మనోజ్ జట్టు 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.
Advertisement
Advertisement