జాతీయ టెన్నిస్ టోర్నీ
ముంబై: రమేశ్ దేశాయ్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు సత్తా చాటారు. అండర్-16 బాలికల విభాగంలో ఎనిమిదో సీడ్ సామ సాత్విక మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో సాత్విక, శివాని ఆమినేని చెరో సెట్ గెలిచారు. అయితే మూడో సెట్‌లో సాత్విక 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో శివాని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో సాత్విక తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. ఇదే విభాగంలో రాష్ట్రానికి చెందిన ప్లేయర్లు హర్ష సాయి చల్లా 3-6, 1-6తో ఆకాంక్ష భాన్ (గుజరాత్) చేతిలో, సాయి దేదీప్య 1-6, 3-6తో రిషిక రవి (తమిళనాడు) చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక బాలుర అండర్-16 విభాగంలో శ్రీవత్స రాచకొండ 2-6, 2-6తో రియాన్ పండోల్ (మహారాష్ట్ర) చేతిలో, రోహన్ కె.రెడ్డి 0-6, 0-6తో మూడో సీడ్ సనిల్ జగ్తియాని (బెంగాల్) చేతిలో ఓటమి పాలయ్యారు. బాలికల అండర్-12 విభాగంలో ఏపీకి చెందిన క్రీడాకారిణిలు రెండో సీడ్ అంజుమ్ షేక్ 6-1, 6-0తో పూర్వి భట్‌పై, నాలుగో సీడ్ ఫాతిమా జువేరియా 6-4, 6-4తో వన్షిక చౌదరి (యూపీ)పై, ఆరో సీడ్ రచనా రెడ్డి 6-2, 6-4తో శ్రేయ కుడుమల (ఏపీ)పై, ధృతి కపూర్ 6-2, 6-2తో అస్మిత కౌర్ (హర్యానా)పై, ముష్రాత్ అంజుమ్ షేక్ 6-2, 6-0తో ఆయూషి సింగ్ (బీహార్)పై విజయం సాధించారు.
మూడో రౌండ్‌లో సామ సాత్విక
Published Wed, May 28 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement