రన్నరప్ ఆదర్శ్ | runner-up Adharsh | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఆదర్శ్

Published Sun, Jun 1 2014 12:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

runner-up Adharsh

 సాక్షి, హైదరాబాద్: రమేశ్ దేశాయ్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు ఆదర్శ్ నాగ తిప్పభట్ల పోరాడి ఓడాడు. అండర్-12 బాలుర విభాగం టైటిల్ పోరులో ఆదర్శ్ ఓడినప్పటికీ చక్కని పోరాట పటిమతో ఆకట్టుకున్నాడు. ముంబైలోని మహారాష్ట్ర లాన్ టెన్నిస్ అసోసియేషన్ కోర్టులో జరిగిన ఈ టోర్నమెంట్ తుదిపోరులో ఆదర్శ్ 7-6 (7/2), 4-6, 1-6తో తెరెన్స్ దాస్ (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూశాడు. దాస్ విజేతగా, ఆదర్శ్ నాగ రన్నరప్‌గా నిలిచారు.

అండర్-16 బాల, బాలికల టైటిళ్లను పరంవీర్ బజ్వా (పంజాబ్), మిహికా యాదవ్ (మహారాష్ట్ర) చేజిక్కించుకున్నారు. బాలుర ఫైనల్లో రెండో సీడ్ పరంవీర్ 6-3, 6-1తో రియాన్ పండోలే (మహారాష్ట్ర)పై గెలువగా, బాలికల ఫైనల్లో మూడో సీడ్ మిహిక 6-2, 6-4తో టాప్ సీడ్ అభినిక (తమిళనాడు)పై విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement