మౌలాలి, న్యూస్‌లైన్: క్రికెట్‌లో రాణించేందుకు కఠోర శిక్షణ అవసరమని మాజీ టెస్టు ఆటగాడు వెంకటపతిరాజు అన్నారు. ఆదివారం చంద్రగిరి కాలనీలోని నలంద హైస్కూల్‌లో జరిగిన నంది క్రికెట్ అకాడమీ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ పాఠశాలలు క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాణ్యమైన క్రీడాకారులను తయారు చేస్తున్నాయని చెప్పారు. అండర్-16 బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అకాడమీ విద్యార్థిని చిత్రను ఆయన అభినందించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో రంజీ మాజీ క్రికెటర్, కోచ్ ఐ.వి.రావు, వసంత్, ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.
కఠోర శిక్షణతోనే సాధ్యం: వెంకటపతిరాజు
Published Mon, Jan 27 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement