క్రికెట్ అకాడమీ ప్రారంభం
నెల్లూరు (బృందావనం) :నగరంలోని పొదలకూరురోడ్డులో చిన్మయ మిషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రేమ్ క్రికెట్ అకాడమీని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఐపీఎల్ క్రీడాకారుడు జ్ఞానేశ్వరరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రంజీ క్రికెట్ క్రీడాకారుడు ప్రేమ్‌సాగర్ జిల్లాలో క్రికెట్ క్రీడారంగ ప్రగతిని కాంక్షించి అకాడమీని ప్రారంభించడం హర్షణీయమన్నారు. జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ నెట్ ప్రాక్టీస్‌తో ప్రారంభించిన అకాడమీ వర్థమాన క్రీడాకారులకు ఎంతో తోడ్పాటును అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రేమ్‌సాగర్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అకాడమీని ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌హ్యాండ్స్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.