కేటీఆర్‌తో వీవీఎస్ లక్ష్మణ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వీవీఎస్ లక్ష్మణ్ అక్కడికి వచ్చి మంత్రిని కలిశారు. హైదరాబాద్‌లో క్రీడల అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన, తాను త్వరలో ప్రారంభించనున్న క్రికెట్ అకాడమీకి సంబంధించిన అంశాలను మంత్రికి క్రికెటర్ లక్ష్మణ్ వివరించినట్టు సమాచారం. తెలంగాణ యువతను మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా కృషి చేస్తున్నామని, ఇలాంటి అకాడమీలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం.