
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగున్న టెస్టు సిరీస్‌తో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో జడేజాకు చోటు దక్కింది. అయితే జడేజాను ఎంపికచేసినప్పటికీ ప్రధాన జట్టులో చోటు మాత్రం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది సెలక్టర్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో జడ్డూ తన ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 24 నుంచి చెన్నై వేదికగా తమిళనాడుతో జరగనున్న మ్యాచ్‌లో జడేజా సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగనున్నట్లు ఈఎస్‌స్పీన్ క్రిక్ ఇన్‌ఫో పేర్కొంది.
కాగా గతేడాది ఆసియాకప్ తర్వాత మోకాలి గాయం కారణంగా జడేజా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న జడేజా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ ((వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్
చదవండి: BBL 2022 23: పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment