టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ.. బౌలింగ్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ హార్దిక్ ఫిట్‌నెస్ పరీక్షలో పాల్గొనున్నాడు. ఇక ఐపీఎల్ కొత్త జట్టు అవతరించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు నిర్వహించనున్న విషయం విధితమే. అయితే ఫిట్‌నెస్ పరీక్షలను క్లియర్ చేయడంలో హార్దిక్ విఫలమైతే ఐపీఎల్‌లో ఆడడానికి బీసీసీఐ అనుమతించదు." హార్దిక్ రెండు రోజులు పాటు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంటాడు.
వివిధ ఫిట్‌నెస్ పరీక్షలలో పాల్గొంటాడు. అతను సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్, అతడు టీ20 ప్రపంచకప్ నుంచి ఎటువంటి క్రికెట్ ఆడలేదు. గత కొంతకాలంగా ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరి అయినందున అతను తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. గత ఏడాది, శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ ఆడటానికి ముందు ఫిట్‌నెస్ టెస్ట్ హాజరయ్యాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు మార్చి 28న లక్నో సూపర్‌జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అదే విధంగా ఐపీఎల్-2022 మార్చి 26నుంచి ఫ్రారంభం కానుంది.
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్.
Comments
Please login to add a commentAdd a comment