సునీల్ ఛెత్రి
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీని సందర్శించాడు. అక్కడ శిక్షణ పొందుతున్న యువ క్రికెటర్‌లతో ఛెత్రి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఎన్సీఏలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఫీల్డింగ్ డ్రిల్‌లో ఆటగాళ్లతో పాటు ఛెత్రి కూడా పాల్గొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. "ఇండియన్ ఫుట్‌బాల్ కెప్టెన్, లెజెండ్ సునీల్ ఛెత్రి ఎన్‌సీఎను సందర్శించాడు. అతడు ఫీల్డింగ్ డ్రిల్‌లో అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్, ప్లేట్ టీమ్‌లకు చెందిన ఆటగాళ్లతో జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడిగా తన అనుభవాన్ని పంచుకున్నాడు" అంటూ బీసీసీఐ పోస్ట్‌కి క్యాప్షన్ జతచేసింది.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
🎥 NCA's Neighbour, Indian Football Captain and Legend, @chetrisunil11 dropping by on Sunday evening. 👏 👏
— BCCI (@BCCI) May 9, 2022
He had a delightful fielding competition and shared some learnings from his own incredible journey in Football with the boys from North East and Plate Teams. 👍 👍 pic.twitter.com/1O1Gx7F12K
Comments
Please login to add a commentAdd a comment