జిమ్‌లో చెమటోడ్చుతున్న హార్దిక్.. రీ ఎంట్రీ అప్పుడే! వీడియో వైరల్‌ | Hardik Pandya sweats out in gym ahead of IPL 2024 return | Sakshi
Sakshi News home page

#Hardik Pandya: జిమ్‌లో చెమటోడ్చుతున్న హార్దిక్.. రీ ఎంట్రీ అప్పుడే! వీడియో వైరల్‌

Published Mon, Jan 8 2024 7:54 PM | Last Updated on Mon, Jan 8 2024 8:12 PM

Hardik Pandya sweats out in gym ahead of IPL 2024 return - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ మధ్యలో తప్పుకున్న సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి జట్టుకు హార్దిక్‌ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో స్వదేశంలో  ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు , దక్షిణాఫ్రికా పర్యటనకు పాండ్యా దూరమయ్యాడు. అదే విధంగా జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో లేడు.

హార్దిక్‌  చీలమండ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు. అతడు ఐపీఎల్‌-2024 సీజన్‌తో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ఉన్న హార్దిక్‌.. పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను హార్దిక్‌ పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 

బరువులు ఎత్తుతూ కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాతో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవరించనున్నాడు. ఐపీఎల్‌-2024 సీజన్‌ మినీ వేలానికి ముందు హార్దిక్‌ను గుజరాత్‌ నుంచి ముంబై ఫ్రాంచైజీ ట్రేడ్‌ చేసి అందరని ఆశ్చర్యపరిచింది.
చదవండి: IND vs SA: రోహిత్‌ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌.. చర్యలకు సిద్దం!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement