
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న అయ్యర్.. బుధవారం బయటకు వచ్చాడు. ఈ క్రమంలో కారులో వెళ్తున్న సమయంలో ఓ తండ్రి చిన్నారితో సహా అయ్యర్ వద్దకు వెళ్లి సాయం కోరాడు. అయ్యర్ వెంటనే ఆ వ్యక్తిను చూసి నవ్వి జేబులో నుంచి కొంత డబ్బును వారికి ఇచ్చాడు.
అదే విధంగా పక్కన మరో వ్యక్తికి కూడా శ్రేయస్ సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా అయ్యర్.. మనసున్న మారాజు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆసియాకప్‌తో రీ ఎంట్రీ..
వెన్ను గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న అయ్యర్.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అయ్యర్ ఏన్సీఏలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అదే విధంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా శ్రేయస్ మొదలు పెట్టాడు.
దీంతో అతడు ఆసియాకప్-2023తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అతడితో పాటు మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఒకట్రెండు రోజుల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే ఛాన్స్ ఉంది.
చదవండి: నెమార్‌కు బంపరాఫర్.. ఏకంగా 832 కోట్లు
A kind gesture from Shreyas Iyer.
— Johns. (@CricCrazyJohns) August 16, 2023
- He is winning hearts of all people. pic.twitter.com/l5jSIB0DZI