Asia Cup 2023: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ | Asia Cup 2023: Shreyas Iyer Has Joined The Practice Session Ahead Of The Bangladesh Match | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Published Thu, Sep 14 2023 4:20 PM | Last Updated on Thu, Sep 14 2023 4:31 PM

Asia Cup 2023: Shreyas Iyer Has Joined The Practice Session Ahead Of The Bangladesh Match - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో రేపు (సెప్టెంబర్‌ 15) జరగాల్సిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. వెన్నునొప్పితో బాధపడుతున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అయ్యర్‌ చురుగ్గా పాల్గొన్నాడు.

దీంతో అతను బంగ్లాతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం ఖాయమని సమాచారం. టీమిండియా ఇదివరకే ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పలువురు సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వాలని భారత యాజమాన్యం భావిస్తుంది కాబట్టి, తుది జట్టులో అయ్యర్‌ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, బంగ్లాదేశ్‌పై అయ్యర్‌ రాణిస్తేనే టీమిండియాకు అసలు సమస్య మొదలవుతుంది.

ఇప్పటికే అయ్యర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రాహుల్‌ పాక్‌పై సూపర్‌-4 మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కడం, అంతకుముందు గ్రూప్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో నాలుగో నంబర్‌ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాపై అయ్యర్‌ కూడా రాణిస్తే ఫైనల్లో ఎవరిని ఆడించాలో, ఎవరిని పక్కకు పెట్టాలో అర్ధం ‍కాదు. దీంతో అయ్యార్‌ ఎంట్రీ ఇప్పటినుంచే టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

రాహుల్‌, అయ్యర్‌, ఇషాన్‌ ముగ్గురు రాణించడం శభపరిణామమే అయినప్పటికీ జట్టు కూర్పు ప్రధాన సమస్యగా మారుతుంది. మున్ముందు భారత మిడిలార్డర్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియాలంటే వేచి చూడాలి. 

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో మరో సూపర్‌-4 మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. సూపర్‌-4 దశలో టీమిండియా వరుసగా పాకిస్తాన్‌, శ్రీలంకలను మట్టికరిపించి, తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్‌కు ముందు భారత్‌ రేపు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. శ్రీలంక-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 14) జరిగే మ్యాచ్‌తో మరో ఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఇవాల్టి మ్యాచ్‌ పాక్‌ గెలిస్తే, భారత్‌తో ఫైనల్లో తలపడుతుంది. ఇలా కాకుండా ఇవాల్టి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైనా, గెలుపు మినహా పాక్‌కు ఎలాంటి ఫలితం వచ్చినా శ్రీలంక ఫైనల్‌కు వెళ్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement