
శ్రీలంకతో మ్యాచ్‌లో 3 పరుగులకే పరిమితమైన కోహ్లి
Asia Cup, 2023- India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో టీమిండియా మ్యాచ్ నేపథ్యంలో తుది జట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే అతడి కోసం యువ ఆటగాళ్లపై వేటు వేయొద్దని.. సీనియర్లకే సర్దుకోవాలని చెప్పాలని సూచించాడు. అయ్యర్ కోసం విరాట్ కోహ్లి తన స్థానం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
రీఎంట్రీలో విఫలం
కాగా గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ కాలం తర్వాత ఆసియా కప్-2023 సందర్భంగా రీఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. నేపాల్‌తో ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
కేఎల్ రాహుల్ పాతుకుపోయాడు
ఈ క్రమంలో సూపర్-4లో మరోసారి టీమిండియా పాక్‌తో తలపడే సమయంలో వెన్నునొప్పి తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వికెట్ కీపర్‌గానూ రాణించాడు.
నామమాత్రపు వన్డేకు శ్రేయస్ అయ్యర్
ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో శుక్రవారం నామమాత్రపు వన్డే ఆడనుంది. విశ్రాంతి తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్‌కు దిగిన అయ్యర్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్‌లో అతడి సన్నద్ధతను పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. అయితే, సీనియర్లకు విశ్రాంతినిస్తే అతడికి రూట్ క్లియర్ అవుతుంది. కానీ వాళ్లు కూడా తుదిజట్టులో ఉంటే.. ఇషాన్ కిషన్‌పై వేటు తప్పకపోవచ్చు.
అయ్యర్ వస్తే కోహ్లి రెస్ట్ తీసుకోవాలి
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉంటే.. కావాల్సినంత ప్రాక్టీస్ చేసి ఉంటే అతడిని తప్పక ఆడించాలి. వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడనే అనుకుంటున్నా.
అయ్యర్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది మన ముందున్న పెద్ద ప్రశ్న. ఇందుకు నా సమాధానం కొందరికి ఆగ్రహం తెప్పించవచ్చు. అయితే, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడు ఇంట్లోని చిన్న పిల్లలకు చెప్పకూడదు. పెద్దవాళ్లే బాధ్యత తీసుకుని అడ్జస్ట్ అయిపోవాలి.
ఆగష్టు నెల మొత్తం ఆటకు దూరమైనా
ముఖ్యంగా ఇప్పటికే ఫామ్ నిరూపించుకున్న సీనియర్లు రెస్ట్ తీసుకోవాలి. నేను మాట్లాడేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే! నేనైతే ఈసారి కోహ్లిని విశ్రాంతి తీసుకోమని అడుగుతాను. ఆగష్టు నెల మొత్తం క్రికెట్‌కు దూరమైనా నేను అతడికే విశ్రాంతినివ్వాలని అంటాను. రోహిత్ కెప్టెన్ కాబట్టి జట్టులో ఉండాల్సిందే’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా కొలంబో వేదికగా శుక్రవారం టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
One final time before the final! 👌#TeamIndia are geared up for #INDvBAN 🙌#AsiaCup2023 pic.twitter.com/5ydNqDaoW2
— BCCI (@BCCI) September 15, 2023