
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభవార్త. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అధికారికంగా లైన్ క్లియర్ అయ్యింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అయ్యర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్‌సీఏ సలహా మేరకు అయ్యర్ ముంబైలోని వెన్నెముక నిపుణుడిని సంప్రదించగా.. అతను అయ్యర్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సదరు వెన్నెముక వైద్యుడు అయ్యర్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తూనే ఓ మెలిక కూడా పెట్టాడని తెలుస్తుంది.
గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్న అయ్యర్ బంతిని డిఫెండ్ చేసే క్రమంలో కాలును ఎక్కువగా చాచ కూడదని హెచ్చరించినట్లు సమాచారం. ఒకవేళ అయ్యర్ అలాంటి షాట్లు ఆడాల్సి వస్తే వెన్ను సమస్య తిరగబెట్టే ప్రమాదమున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ వెన్ను సమస్య కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే.
కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment