చ‌రిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే | Shreyas Iyer becomes first captain in IPL history to attain Rare milestone | Sakshi
Sakshi News home page

IPL 2024: చ‌రిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే

Published Wed, May 22 2024 4:57 PM | Last Updated on Wed, May 22 2024 8:40 PM

Shreyas Iyer becomes first captain in IPL history to attain Rare milestone

ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఫైన‌ల్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కేకేఆర్‌.. ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 

ఈ విజ‌యంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుల‌కెక్కాడు. 

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సార‌థిగా శ్రేయస్ ఫైనల్‌కు చేర్చాడు. ఆ త‌ర్వాత‌ ఢిల్లీ ఫ్రాంచైజీ వదులుకోవడంతో కేకేఆర్ జ‌ట్టుతో జ‌త క‌ట్టిన అయ్య‌ర్‌.. మ‌రోసారి త‌న కెప్టెన్సీ మార్క్ చూపించి ఫైన‌ల్‌కు తీసుకెళ్లాడు. 

దీంతో ఈ  అరుదైన ఫీట్‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఏ కెప్టెన్‌కు ఈ ఘ‌న‌త సాధ్యం కాలేదు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్‌ను అయ్య‌ర్ అద్భుతంగా న‌డిపించాడు. 

లీగ్ ద‌శ‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో కేకేఆర్‌ను అగ్ర‌స్ధానంలో నిలిపాడు. స‌న్‌రైజ‌ర్స్‌తో జరిగిన క్వాలిఫ‌య‌ర్‌-1లో శ్రేయ‌స్ కెప్టెన్సీ ప‌రంగా మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా దుమ్ములేపాడు.
చదవండి: USA vs BAN: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. యూఎస్‌ఏ సంచలన విజయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement