Asia Cup, 2023 - India vs Bangladesh- India Playing XI: ఆసియా కప్-2023 సూపర్-4లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ఊహించినట్లుగానే నామమాత్రపు మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చింది మేనేజ్‌మెంట్.
అదే విధంగా పనిభారం తగ్గించే క్రమంలో.. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను బెంచ్‌కే పరిమితం చేసింది. శ్రీలంకతో ఫైనల్‌కు ముందు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు వైస్ కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సహా పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు కూడా రెస్ట్ ఇచ్చారు.
అయ్యర్‌కు నో ఛాన్స్
ఈ నేపథ్యంలో హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ వన్డే అరంగేట్రం చేయగా.. ఈ వన్డే టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్ తొలిసారి తుదిజట్టులోకి వచ్చాడు. అదే విధంగా శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ కూడా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చారు.
అయితే, ఫిట్‌నెస్ సాధించి ప్రాక్టీస్ చేసిన శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడికి మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే కోహ్లితో పాటు వాళ్లంతా అవుట్: రోహిత్ శర్మ
ఇక కొలంబోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఈ టోర్నీలో పూర్తిస్థాయిలో ఫీల్డింగ్ చేయలేదు. కాబట్టి ఈసారి తొలుత బౌలింగ్ చేస్తాం.
లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్‌ను చక్కగా వినియోగించుకున్న వాళ్లందరికీ సహకరిస్తోంది. పేసర్లు, స్పిన్నర్లూ రాణించగలుగుతున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్‌లో ఆడని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం.
అందుకే ఐదు మార్పులు చేశాం. విరాట్, హార్దిక్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్‌లను తప్పించాం. తిలక్ అరంగేట్రం చేస్తున్నాడు. షమీ, ప్రసిద్ జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్‌ను కూడా ఆడిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.
ఫైనల్లో శ్రీలంకతో పోటీపడనున్న టీమిండియా
కాగా సూపర్-4లో పాకిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించిన భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో గెలుపొందిన శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.
టీమిండియా- శ్రీలంక మధ్య సెప్టెంబరు 17న కొలంబో వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో బీసీసీఐ ఈ మేరకు మార్పులు చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ కృష్ణ.
చదవండి: చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్!? వైరల్
Comments
Please login to add a commentAdd a comment