Watch: Rishabh Pant shares video of himself climbing up stairs at NCA - Sakshi
Sakshi News home page

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎవరి సాయం లేకుండా మెట్లెక్కేసిన పంత్! వీడియో వైరల్‌

Published Wed, Jun 14 2023 6:31 PM | Last Updated on Wed, Jun 14 2023 7:50 PM

Rishabh Pant shares video of himself climbing up stairs at NCA - Sakshi

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో శిక్షణ పొందుతున్న పంత్‌..పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే పనిలో పడ్డాడు. ఇక  తన హెల్త్‌ అప్‌డేట్స్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకొనే పంత్.. తాజాగా మరో వీడియో పోస్టు చేశాడు.

తన ట్రైనింగ్‌ సంబంధించిన వీడియోను పంత్‌ షేర్‌ చేశాడు. పంత్‌ ఎటువంటి సపోర్ట్‌ లేకుండా మెట్లు ఎ‍క్కుతుండడం ఈ వీడియోలో  కన్పించింది. అయితే మెట్లు ఎక్కే క్రమంలో తొలుత పంత్‌ కాస్త ఇబ్బంది పడిన ఆ తర్వాత మాత్రం కొంచెం ఈజీగా ముందుకు వెళ్లాడు. కాగా ఈ వీడియోకు "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. చిన్న పనులే కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి" అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఈ వీడియో చూసిన పంత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా వేగంగా రిషబ్ కోలుకుంటున్నాడని.. త్వరలోనే మైదానంలో కనిపిస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా పంత్‌ గాయం కారణంగా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌, ఐపీఎల్‌, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు పంత్‌ దూరమయ్యాడు. రిషబ్‌ తిరిగి మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌కు మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.
చదవండిBAN vs AFG: ఆఫ్గాన్‌ పేసర్‌ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏడో బౌలర్‌గా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement