టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న పంత్.. శర వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మెదలుపెట్టేశాడు.
మైదానంలో అడుగుపెట్టిన రిషబ్..
ఇక ఇది ఇలా ఉండగా.. గాయపడిన 8 నెలల తర్వాత పంత్ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఫాండేషన్ నిర్వహించిన ఓ స్ధానిక టోర్నీలో బరిలోకి దిగిన పంత్.. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఫ్రంట్ ఫుట్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్ అభిమానులను అలరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక స్వదేశంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్‌కు రానుంది.
చదవండి: #Shreyas Iyer: మంచి మనసు చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్
#CWC2023 #AsiaCup #Rishabhpant
— CrickStory (@CrickStory) August 16, 2023
What's your reaction if rishabh pant returns into the team for ODI WC #AUSvENG #JaspritBumrah #ICCWorldCup2023 pic.twitter.com/aRl9dioNur
Comments
Please login to add a commentAdd a comment