ఆసియాకప్-2023 కోసం టీమిండియా తీవ్రంగా శ్రమించింది. జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో 5 రోజుల పాటు భారత జట్టు కఠోర సాధన చేసింది. భారత జట్టు ప్రాక్టీస్ క్యాంపు మంగళవారంతో ముగిసింది. ఈ మెగా టోర్నీ కోసం రోహిత్ సేన బుధవారం శ్రీలంకకు పయనమైంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.
ప్రాక్టీస్ క్యాంప్‌లో రిషబ్ పంత్..
ఇక ఆఖరి రోజు ప్రాక్టీస్ క్యాంప్‌లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సందడి చేశాడు. చాలా సమయం పాటు సహచర ఆటగాళ్లతో పంత్ గడిపాడు. ఆసియాకప్‌కు ముందు ఆటగాళ్లలో జోష్ నింపేందుకు పంత్ వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కూడా పంత్ ముచ్చటించినట్లు సమాచారం.
కాగా గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరంగా ఉంటున్న పంత్.. ప్రస్తుతం ఏన్సీఏలోనే ఉంటునున్నాడు. రీ ఎంట్రీ ఇచ్చేందుకు పంత్ అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు. అతడు ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు.
స్వదేశంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ పునరాగమనం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్‌కు రానుంది.
చదవండి: Asia Cup 2023: ‘ఆసియా’ సింహాల సమరానికి సై.. చరిత్ర టీమిండియాదే
Comments
Please login to add a commentAdd a comment