IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌ | IPL 2024: Rishabh Pant Gets Clearance From NCA Ahead Of IPL 2024 Says Reports, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌

Published Sun, Mar 10 2024 8:24 PM | Last Updated on Mon, Mar 11 2024 10:06 AM

Rishabh Pant Gets Clearance From NCA Ahead Of IPL 2024 Says Reports - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. ఆ జట్టు సారధి రిషబ్‌ పంత్‌కు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (NCA) క్లియరెన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్‌సీఏ ఎన్‌ఓసీతో ఐపీఎల్‌ 2024 ఆడేందుకు పంత్‌కు లైన్ క్లియర్‌ అవుతుంది. 

ఎన్‌సీఏ నుంచి అధికారికంగా అనుమతి లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ పేరును జట్టులో చేర్చలేదు. గత కొద్ది రోజులుగా పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. అతని ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ చూస్తే మనుపటి తరహాలో కనిపిస్తుంది. ప్రాక్టీస్‌ క్యాంప్‌లో పంత్‌ మునుపటిలా భారీ షాట్లు ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. 

అయితే పంత్‌ వికెట్‌కీపింగ్‌ చేయడంపై మాత్రం డీసీ యాజమాన్యం ఆఖరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలుస్తుంది. పంత్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని పలు నివేదికలు తెలుపుతున్నాయి. 2022 డిసెంబర్‌ 31న పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కొద్ది రోజుల కిందటే అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్‌ ఎన్‌సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. వీరు క్లీన్‌ చిట్‌ ఇస్తేనే పంత్‌ ఐపీఎల్‌ 2024లో ఆడతాడు. పంత్‌ గైర్హాజరీలో గతేడాది డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

కాగా, ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో డీసీ.. పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. తొలి విడతలో క్యాపిటల్స్‌ ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. పంజాబ్‌ (మార్చి 23), రాజస్థాన్‌ (మార్చి 28), సీఎస్‌కే (మార్చి 31), కేకేఆర్‌ (ఏప్రిల్‌ 3), ముంబై ఇండియన్స్‌ను (ఏప్రిల్‌ 7) డీసీ ఢీకొట్టనుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement