PC: BCCI
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపచంకప్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి స్వస్థలం ముంబైకు చేరుకున్నట్లు సమాచారం. "బుమ్రా తన గాయం నుంచి కోలుకోవడంతో పురోగతి సాధించాడు. ఫిజియోలతో నిరంతరం మేము టచ్‌లో ఉన్నాం.
మా జట్టు ప్రధాన ఫిజియో నితిన్ పటేల్ జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిజియోలతో ఎప్పటికప్పడు బుమ్రా గాయం గురించి చర్చిస్తున్నాడు. బుమ్రా తిరిగి ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడనున్నాడని మేము భావిస్తున్నాం. అయితే అతడు టీ20 ప్రపంచకప్‌కు మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు టీ20ల సిరీస్ నిమిత్తం ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అనంతరం ఆదే నెలలో దక్షిణాఫ్రికా జట్టు కూడా ఐదు టీ20ల సిరీస్ కోసం భారత గడ్డపై అడుగు పెట్టనుంది.
చదవండి: Asia cup 2022: 'కోహ్లి మళ్లీ విఫలమయ్యాడు.. ఇదీ ఒక ఇన్నింగ్సేనా'
Comments
Please login to add a commentAdd a comment