Massive Fire ఇరాన్‌లో జరిగిన ఘోర అగ్రి ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మత్తు మందులనుంచి బయటపడాలన్న మంచి ఆశయంతో మాదక ద్రవ్యాల పునరావాస కేంద్రంలో చేరిన బాధితులు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది.
గురువారం రాత్రి జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 32 మంది మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో బాధితులు అందులో చిక్కుకు పోయారు. మంటల ధాటికి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బాధితులు తప్పించుకునే మార్గం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియ రాలేదు.
ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లాంగరుడ్ నగరంలోని డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మొహమ్మద్ జలాయ్ తెలిపారు. ఈ సెంటర్ నిర్వాహకుడితో పాటు పలువురిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment