న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల పునరావాసంతోపాటు శాంతి భద్రతలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలు, ఆయుధాల స్వాధీనం వంటి అంశాలపై తాజా నివేదికను సమరి్పంచాలని మణిపూర్ ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, కర్ఫ్యూ సమయాన్ని ఐదు గంటలకు కుదించామని మణిపూర్ ప్రభుత్వం తెలియజేసింది.
మణిపూర్‌లో మైనారీ్టలైన కుకీ తెగ గిరిజనులకు రక్షణ కలి్పంచాలని కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఆగస్టు 10కి వాయిదా పడింది. మరోవైపు, వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం పునఃప్రారంభమైంది. మణిపూర్ పరిణామాలకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment