ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా అవతరణ వేడుకలు పదికాలాల పాటు చక్కగా గుర్తుండేలా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. జిల్లా ఏర్పాటై 60 సంవత్సరా లు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం అవతరణ వేడులు ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అవతరణ వేడుకలను వచ్చే జనవరి 26వ తేదీ వరకు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. అవతరణ వేడుకలను జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్, మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఆవిర్భావం నుంచి నేటి వరకు జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రముఖులను ఈ సందర ్భంగా సత్కరించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సమాచారం సేకరిం చేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు వీలుగా జుజ్చిఝఝ్చఝ60డ్ఛ్చటటఃజఝ్చజీ.ఛిౌఝను ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యురాలు గారపాటి రేణుకాచౌదరి మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు.
జిల్లాకు వచ్చే రహదారులపై ప్రవేశమార్గాలలో 60 వసంతాల చిహ్నాలతో ద్వారాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఖమ్మంను గ్రేటర్ ఖమ్మంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించామని అన్నారు. దీనికోసం జిల్లాలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. శాసనసభ ఉపసభాపతి మల్లుభట్టివిక్రమార్క మాట్లాడుతూ గత 60 ఏళ్ల కాలంలో ఖమ్మంజిల్లా వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని, జిల్లాలోని సహ జవనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని మరింత వడివడిగా అభివృద్ధి చెందాలని అన్నారు. జనవరి 26 వరకు నిర్వహించే ఈ వేడుకల్లో భాగంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకుని మధిరలో ‘మధిరోత్సవాలను’ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన, జిల్లా ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, మెప్మా పీడీ వేణుమనోహర్, డీఈఓ రవీంద్రనాధ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, జిల్లా సాంస్కృతికమండలి సభ్యులు వీవీ అప్పారావు, నాగబత్తిని రవి, వివిధ శాఖల అధికారులు, పలువురు కవులు, కళాకారులు, రచయితలు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ రేణుకాచౌదరి జ్యోతి ప్రజ్వలనచేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 60 వసంతాల కేక్‌ను కట్‌చేశారు.
ఘనస్వాగతం: అవతరణ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీస్తంభాద్రి గుట్టకు వచ్చిన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ శనగవరపు ప్రసాద్, కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్‌మోహన్‌రావు, అర్చకులు నరహరి నరసింహాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో వారికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భం గా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీలక్ష్మినరసింహస్వామికి, శ్రీలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. జిల్లా అవతరణ వేడుకల ప్రారంభ సూచికగా ఎంపీ రేణుకచౌదరి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే మిత్రసేన తదితరు లు బెలూన్లను గాలిలో ఎగురవేశారు. కళాకారులు మొగిలి వెంకటేశ్వర్లు, మిమిక్రీ సుధాకర్, కిన్నెర జాన్, ఫైర్ రవి తమ ఆట పాటలతో అలరించారు.
జిల్లా అవతరణ వేడుకలు పదికాలాలు గుర్తుండాలి...
Published Wed, Oct 2 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement